కామారెడ్డి, డిసెంబరు 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గుడ్ గవర్నెన్స్ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఆదివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన యూత్ పార్లమెంట్లో ప్రసంగించింది. వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి మరియు దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది నేడు అటల్ బిహారీ వాజ్పేయి గురించి మాట్లాడే అవకాశం లభించగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందింది.
ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆమెను అభినందించారు. ఆర్కే కళాశాల సీఈవో డాక్టర్ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులను వెన్ను తట్టి ప్రోత్సహిస్తూ అన్నిరంగాల్లోనూ గెలుపొందే విధంగా ప్రోత్సాహిస్తున్నామని తెలిపారు. ఆర్.కె. కళాశాల, తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠను దేశవ్యాప్తంగా పెంపొందించినందుకు మౌనికకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సిఇవో, ఛైర్మన్, కో ఆర్డినేటర్, డీన్, ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, ఏ.వో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.