కామరెడ్డి, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ప్రొహిబిషన్, ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు 52 గుడుంబా కేసులు,75 కల్లు శాంపిలను, 3484 కిలోల అక్రమ బెల్లం స్వాధీనం చేసుకున్నట్లు కామారెడ్డి ఎక్సైజ్ సీఐ. ఎన్. విజయ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి డిసెంబర్ 26 వరకు నమోదు అయిన కేసులు వివరాలు ఆయన వెల్లడిరచారు.
కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మొత్తం 52 నాటు సారా తయారీ దారులపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ఆరుగురు బైండోవర్ ఉల్లంఘించిన వారిపై బ్రాంచి కేస్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. వీరిలో ఇద్దరు జైలు శిక్ష అనుభవించినట్లు చెప్పారు. మరొకరు లక్ష రూపాయలు జరిమానా చెల్లించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా కల్లు అమ్మినవారిపై 11 కేసులు నమోదు చేశామన్నారు.
లైసెన్స్ ఉన్న కల్లు దుకాణాల నుంచి 75 కల్లు శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌కు పంపినట్టు చెప్పారు. కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో అక్రమ రవాణా చేస్తున్న 1600 కిలోల బెల్లం ను రైల్వే పోలీసుల సహాయంతో పట్టుకున్నట్టు వివరించారు. మొత్తం 5 వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. అక్రమంగా నాటు సారా తయారీ చేసినా, రవాణా చేసినా, తయారీకి ముడిసరుకు అందించినా, కల్లులో ఎటువంటి మత్తు పదార్థాలు కలిపిన కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ ఎన్. విజయ కుమార్ పేర్కొన్నారు.