బాన్సువాడ, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి చేపట్టిన పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ చలో ఇందిరా పార్క్ సమర దీక్ష కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డిని వర్ని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించారు.
ఈ సందర్భంగా కూనీపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ పోలీస్ వ్యవస్థలో ఎస్సై మరియు కానిస్టేబుల్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని గుర్తు చేయడానికి చేపట్టిన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద జరిగే సమరదీక్షకు వెళుతుంటే పోలీసులు అరెస్టు చేయడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు.
పోలీసు వ్యవస్థలో జరిగిన అన్యాయం పట్ల యూత్ కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమం విజయవంతం అవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ప్రభుత్వం పోలీసులచే ఎన్ని అరెస్టులు చేసినా భయపడేది లేదని, హైకోర్టు చివాట్లు పెట్టి, వారికి న్యాయం చేయాలని కోరినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. సుమారు 50 నుంచి 60 వేల మంది అర్హులు కాలేకపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అరెస్టయిన వారిలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, దయానంద్ ఉన్నారు.