కామారెడ్డి, డిసెంబరు 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో 2023 – 2024 సంవత్సరానికి గాను రూ.5090 కోట్లతో రూపొందించిన జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్ ( నాబార్డ్) ప్రొటెన్షియల్ లింక్‌డ్ క్రెడిట్ ప్లాన్‌ను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు.
పంట రుణాలకు రూ.3165 కోట్లు, వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.1005 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ.174 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, నాబార్డ్ ఎజిఎం నగేష్, ఎల్‌డిఎం చిందం రమేష్, జిల్లా పశువైద్యాధికారి భరత్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయభాస్కర్ పాల్గొన్నారు.