ఎన్‌వైకె ఆధ్వర్యంలో అంటు వ్యాధులపై అవగాహన సదస్సు

కామారెడ్డి, డిసెంబరు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ ,టిబి, ఇతర లైంగిక, అంటు వ్యాధుల పట్ల యువతకు అవగాహన, శిక్షణ సదస్సును స్థానిక పిజెఆర్‌ స్ఫూర్తి కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమ ప్రారంభంలో సభాధ్యక్షురాలు, కార్యక్రమ నిర్వాహకురాలు, జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్‌ మాట్లాడుతూ నెహ్రూ యువ కేంద్ర ప్రతిష్టాత్మకంగా ఈ శిక్షణను అన్ని జిల్లాల్లో నిర్వహిస్తోందని, యువతీ యువకులకు ఈ విషయాల పట్ల అవగాహన తప్పనిసరిగా ఉండాలని, కావున శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్‌ కంట్రోల్‌ సొసైటీ నుంచి విచ్చేసిన శిక్షకులు స్వామి మాట్లాడుతూ హెచ్‌ఐవి ఎయిడ్స్‌ వ్యాధి పట్ల అవగాహన లోపమే వ్యాధి పెరగడానికి కారణమని, ఎయిడ్స్‌ వ్యాధి గ్రస్థులను బహిష్కరించడం అమాణుశమని అలా చేయకూడదని సూచించారు. సరైన అవగాహన, జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి నుంచి మొత్తం సమాజాన్ని తప్పించవచ్చని సూచించారు.

జిల్లా టిబి నియంత్రణ జిల్లా పబ్లిక్‌ ప్రయివేటు కో ఆర్డినేటర్‌ శోభా రాణి మాట్లాడుతూ టిబి లక్షణాలు కలవారికి ప్రభుత్వం ఉచితంగా మందులు, వైద్య సేవ అందిస్తుందని కావున మన ఇంట్లో, చుట్టుపక్కల ఎవరైనా దగ్గు, దమ్ము, బలహీనత కలిగిన వారిని గుర్తించి వారిని చికిత్స కోసం పంపాలని కోరారు. హెచ్‌ఐవి నియంత్రణ అధికారి సుధాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఈ తరహా వ్యాధుల నివారణకు ఎన్నో చర్యలు చేపట్టిందని, ప్రజలకు అందుబాటులో కండోమ్స్‌, ఇతర రక్షణ జాగ్రత్తల వివరాలతో కూడిన ప్రచారం చేస్తుందని దానిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ ప్రతినిధులు సుధాకర్‌, కళాశాల డైరెక్టర్‌ గురువేందర్‌ రెడ్డి, ప్రిన్సిపాల్‌ విజయ్‌, నెహ్రూ యువ కేంద్ర వలంటీర్లు సందీప్‌, లత, కళాశాల సిబ్బంది, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »