ఎడపల్లి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 138వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోధన్ నియోజకవర్గంలోని ఎడపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, ఖాజా ఫయాజొద్దిన్‌లను శాలువా, పూల మాలలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ… దేశ స్వాతంత్రం తెచ్చిన గొప్ప చరిత్రగల పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, తెలంగాణ రాష్ట్రము ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా ఎప్పుడు ప్రజలకోసం పాటుపడేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ స్థాపించి 137 సంవత్సరాలు పూర్తయి 138 సంవత్సరంలోకి అడుగిడిరదన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు సోనియా గాంధీ తెలంగాణ రాష్టం ఇచ్చారని, కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎనో సంక్షేమ పథకాలను అమలు చేశారని తెలిపారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, మధు యాష్కి, కరుణాకర్ రెడ్డిల నాయకత్వంలో పార్టీని మరింత పటిష్టం చేస్తామన్నారు.
వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం ఇప్పటినుంచే కార్యాచరణ ప్రారంభిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ భాస్కర్ రాజ్, బోధన్ పట్టణ మాజీ కౌన్సిలర్ కాజా ఫయాజుద్దీన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాజేశ్వర్ పటేల్, బుడ్డ పోశెట్టి, దూపల్లి సొసైటీ డైరెక్టర్ నీరడి రవికుమార్, బొక్కెన శ్రీనివాస్, రాజశేఖర్, మజీద్ ఖాన్,రెంజల్ కరుణాన్న యువసేన మండల అధ్యక్షులు అలిముద్దీన్, గైని శేఖర్, అర్బాజ్, ముక్రం, శేఖర్, సాయికుమార్, గంగాధర్, జాన్సన్, విజయ్ కుమార్, పిట్ట అబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.