కామారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్ క్రాస్ మండల వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రక్తదానం చేయడం అంటే వ్యక్తి ప్రాణాలను కాపాడడమే అన్నారు. రక్తదానం చేయడం వల్ల 90 శాతం గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వివిధ సర్వేల ద్వారా జరిపిన ఫలితాల ద్వారా తెలిసిందన్నారు. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన యువతీ యువకులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చును అన్నారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ డివిజన్ చైర్మన్ జమీల్, టెక్నీషియన్ చందన్, యేసు గౌడ్ పాల్గొన్నారు.