ఎడపల్లి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామ శివారులోని సుప్రసిద్దమైన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం శుక్రవారం నిర్వహించారు. ఈ మేరకు బోధన్ దేవాదాయ శాఖ పరిశీలకులు కమల ఆలయ ట్రస్ట్ బోర్డ్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
ఆలయ చైర్మన్ గా పురం సాయి లు, కమిటీ సభ్యులుగా చిలుక నర్సయ్య, ప్రకాష్ రావు, మాద స్తూ లక్ష్మి, గొల్ల సాయి లు, గుండ సరోజినీ లను నియమించగా, ఆలయ అర్చకులు కొండమాచార్యులు ఎక్స్ ఆఫీసీయో మెంబర్ గా దేవాదాయ శాఖ నియమించింది.
ఈ సందర్భంగా ఆలయ నూతన చైర్మన్ పురం సాయిలు మాట్లాడుతూ… ఆలయ చైర్మన్ గా బాద్యతలు చేపట్టిన తాను ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తనపై నమ్మకం ఉంచి ఆలయ చైర్మన్గా నియమించిన బోధన్ ఎమ్మెల్యే షకీల్కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సాయిలు, ఎంపీటీసీ మంద సంజీవ్, ఆలయ ఈఓ వేణు, సొసైటీ చైర్మన్ నరేందర్, మాజీ సర్పంచ్ దశరథ్, ఆలయ మాజీ చైర్మన్ విజయ్ గౌడ్, కెసిఆర్ సేవా దళ్ సభ్యుడు శేఖర్ రాజు, రాజా గౌడ్, యంబ రాజేశ్వర్, ఆబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.