కామారెడ్డి, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ అధికారి ఎస్. రవీందర్ రాజు ఆదేశాల అనుసారం ఇటీవల కాలంలో నాటుసారా స్థావరాలపై జరిపిన దాడుల్లో సోమార్ పేటకి చెందిన బానోత్ నీల రెండో సారి నాటుసారా విక్రయిస్తూ పట్టుబడిరది.
బైండోవర్ ఉల్లంఘించిన కారణంగా మాచారెడ్డి తాసిల్దార్ సంవత్సరం పాటు జైలు శిక్ష విధించారు. ఎవరైనా బైండోవర్ ఉల్లంఘిస్తూ తిరిగి నాటుసారా తయారీ చేసిన, రవాణా చేసినా కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ సీఐ. ఎన్. విజయ కుమార్ పేర్కొన్నారు.