నిజామాబాద్, డిసెంబరు 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెన్షనర్లు, ఇతర లబ్ధిదారుల ప్రయోజనాల దృష్ట్యా వెల్నెస్ సెంటర్‌ను అందరికీ అందుబాటులో ఉండే విధంగా, అన్ని వసతులతో కూడిన భవనంలోనికి మారుస్తామని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా ప్రతినిధి బృందం జిల్లా పరిషత్ మీటింగుకు హాజరైన జిల్లా కలెక్టర్‌ను కలిసి మెమోరాండం సమర్పించి, వెల్నెస్ సెంటర్ గురించి చర్చించారు.
అదేవిధంగా జిల్లా పరిషత్ సమావేశంలో చైర్మన్ దాదన్న గారి విట్టల్ రావుకి, ఇతర అధికారులకు కూడా మెమోరాండం సమర్పించారు. ప్రస్తుతమున్న ప్రభుత్వ ఆస్పత్రి నుండి బస్టాండ్ ఎదురుగానున్న మాత శిశు భవనంలోనికి మార్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు చెప్పారు. కార్యకమ్రంలో సంఘ జిల్లా అధ్యక్షులు కే రామ్మోహన్రావు ప్రధాన కార్యదర్శి సూదం మదన్ మోహన్, ఉపాధ్యక్షులు భోజరావు, శిర్ప హనుమాన్లు, ప్రసాద్ రావు, పురుషోత్తం, తదితరులు ఉన్నారు.