కామారెడ్డి, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పద్మాజివాడి చౌరస్తా వద్ద వెహికల్ అండర్ పాస్ ఏర్పాటు చేయడానికి నేషనల్ హైవే అధికారులు మిషన్ భగీరథ పైప్ లైన్లను షిఫ్ట్ చేసేందుకు కావలసిన నిధులను సమకూర్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో గురువారం నేషనల్ హైవే, మిషన్ భగీరథ అధికారులతో వెహికల్ అండర్ పాస్ ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు.
మిషన్ భగీరథ పైప్ లైన్ పనులు చేసే సమయంలో 320 గ్రామాలకు, కామారెడ్డి మున్సిపాలిటీకి తాగునీటి సమస్య ఏర్పడే అవకాశం ఉన్నందున పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నరేష్ (ఆర్మూర్), కామారెడ్డి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అమీర్ ఖాన్, నేషనల్ హైవే ప్రాజెక్టు డైరెక్టర్ తరుణ్, మిషన్ భగీరథ, నేషనల్ హైవే అధికారులు పాల్గొన్నారు.