నిజామాబాద్, డిసెంబరు 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకార మహోత్సవం నగరంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయం నాగారంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అథితిగా నగర మేయర్ హాజరై స్వర్ణకార వృత్తి విశిష్టత గురించి వివరించి, ప్రభుత్వ పరంగా అందాల్సిన సంక్షేమ పథకాల గురించి తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో జిల్లా నూతన అధ్యక్షులు తంగళ్ళపల్లి శ్రీనివాసచారి, ప్రధానకార్యదర్శి సరాపు లక్ష్మీనర్సయ్యచారి, కోశాధికారి సల్లుర్ వార్ అశోకచారి, కార్యనిర్వాహక కార్యదర్శి బందనకంటి నరసింహాచారి, చెన్నోజు కిరణ్ చారి, కటకం గోవిందా చారి, ముచ్కూరు నాగభూషణం చారి, మంచిర్యాల రవీంద్రచారి, రమేష్ చారి, మారోజు సుధాకర చారి, పెందోట అనిల్ చారి, సుంకం శ్రీనివాసచారి, సేపూరి శ్రీనివాసచారి, సేవర్తి శ్రీనివాసచారి, ప్రహ్లాద చారి, రామ చారి వివిధ మండలాల సంఘ పెద్దలు సభ్యులు, కార్యవర్గ సభ్యులందరు హాజరయ్యారు. నిజామాబాద్ జిల్లా స్వర్ణకార సంఘం తరపున కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతినిదులందరికి ధన్యవాదాలు తెలిపారు.