బాన్సువాడ, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొడంగల్ గ్రామంలో నిర్వహించిన నాస్తికుల సభలో అయ్యప్ప స్వామిని కించపరుస్తూ నీచంగా మాట్లాడి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన బైరి నరేష్ తక్షణమే అరెస్టు చేసి, పిడి యాక్ట్ విధించి, హిందూ మతంను దూషిస్తే పకడ్బందీగా అమలుపరిచే ఐపిసి. 295( వన్), 502( టు) సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బాన్సువాడ అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అయ్యప్ప స్వామి ఆలయం నుండి ప్రారంభమైన భారీ ర్యాలీ పోలీస్ స్టేషన్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మాలా ధరించిన అయ్యప్ప స్వాములు బైరి నరేష్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినదించారు. ఈ సందర్భంగా శబరిమలై మహాపాదయాత్ర గురుస్వామి గురు వినయ్ కుమార్ మాట్లాడుతూ హిందూ దేవి, దేవతలపై, నిరంతరం అసభ్యకర పదజాలంతో దూషిస్తున్న బైరి నరేష్‌పై పోలీసులు తక్షణమే స్పందించి కేసు నమోదు చేసి, హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిపై పకడ్బందీగా శాఖ పరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేనియెడల సంబంధిత డివిజనల్, జిల్లా, రాష్ట్రస్థాయి, అధికారులను సంప్రదిస్తామని, అప్పటికి న్యాయం జరగని ఎడల, జిల్లా బందుకు పిలుపునిచ్చి తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తామని తెలిపారు.
హిందూ సంఘాలను ఏకం చేసి, గ్రామస్థాయి నుండి రాష్ట్రస్థాయి వరకు ఉద్యమాన్ని ఉధృతం చేసి, బైరి నరేష్‌కు శిక్ష పడే వరకు ఊరుకోమని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరించిన వ్యక్తిపై శాఖాపరమైన చర్యలు తీసుకునేంతవరకు, హిందూ సంఘాలు అన్ని ఏకమై, ఉద్యమించాల్సిన అవసరం ఆసన్నమైందని అన్నారు. ‘‘ధర్మకి జయహో ‘‘..’’.అధర్మకా నాష్ హో’’..అని నినదించారు.
కార్యక్రమంలో బాన్సువాడ అయ్యప్ప సేవా సమితి అధ్యక్షుడు ముదిరెడ్డి విట్టల్ రెడ్డి, కార్యదర్శి కరట్లపల్లి శంకర్ గౌడ్, కోశాధికారి ధనగారి కృష్ణారెడ్డితో పాటు గురు స్వాములు పిన్నూరి మల్లికార్జునరావు, కొర్ల నారాయణరెడ్డి, అర్సపల్లి సాయిరెడ్డి, ర్యాల విటల్ రెడ్డి, ర్యాల హనుమంత్ రెడ్డి, జయ వీరప్ప, గుడుగుట్ల శ్రీనివాస్ గుప్తా మామిళ్ళ నాగరాజు, మాల ధరించిన అయ్యప్ప స్వాములు, హిందూ సంఘాల ప్రతినిధులు, తదితరులు, పాల్గొన్నారు.