కామారెడ్డి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2023-24 సంవత్సరానికి మున్సిపల్ బడ్జెట్ అంచనాలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో శుక్రవారం మున్సిపల్ అధికారులతో బడ్జెట్ అంచనా పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు.
మున్సిపల్ ఆదాయం – వ్యయంలను తయారు చేయాలని సూచించారు. పట్టణ ప్రగతి ద్వారా వచ్చిన నిధుల నుంచి 10 శాతం గ్రీన్ బడ్జెట్ ఖర్చు చేయాలని కోరారు. గ్రీన్ బడ్జెట్ నిధులను నర్సరీల, పార్కుల అభివృద్ధికి కేటాయించాలని పేర్కొన్నారు.
కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపాలిటీల బడ్జెట్ అంచనాలను సిద్ధం చేయాలని అధికారులకు తెలిపారు. సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ మున్సిపల్ కమిషనర్లు దేవేందర్, జగ్జీవన్, రమేష్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.