కామారెడ్డి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (24) పట్టణానికి చెందిన మహిళకు అనిమీయాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నాగసాయికి తెలియజేయడంతో వెంటనే స్పందించి 6వసారి సకాలంలో రక్తాన్ని అందజేసి చేసి ప్రాణాలు కాపాడారన్నారు.
18 సంవత్సరాల వయసు నుండి రక్తదానాన్ని ప్రారంభించి నేడు 6వ సారీ రక్తదానం చేయడం అభినందనీయమని నేటి యువకులు నాగసాయిని ఆదర్శంగా తీసుకొని రక్తదానానికి ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త, కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జతేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిఎస్ రక్తనిధి కేంద్రం టెక్నీషియన్లు జీవన్, వెంకటేష్, సంతోష్ పాల్గొన్నారు.