కామారెడ్డి, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 25, గుడ్ గవర్నెన్స్ డే ని పురస్కరించుకొని భారతదేశ వ్యాప్తంగా జరిగిన కాంపిటీషన్స్‌లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఎంపికైన ఆర్కే కళాశాల విద్యార్థిని కే .మౌనిక ఢల్లీిలో పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన యూత్ పార్లమెంట్లో ప్రసంగించింది.
వివిధ దశలలో కళాశాల, యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి, దేశస్థాయిలో జరిగిన పోటీల్లో గెలుపొంది అటల్ బిహారీ వాజ్‌పాయి గురించి మాట్లాడే అవకాశం లభించగా, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో అద్భుతంగా ప్రసంగించి అందరి మన్ననలు పొందింది.
ఈ సందర్భంగా గౌరవ జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు,విప్.బిబి. పాటిల్ తన కార్యలయంలో మర్యాద పూర్వకంగా కలిసిన మౌనికను అభినందించారు. అదేవిదంగా శాలువాతో సత్కరించారు. తన వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని మౌనికకు భరోసా ఇచ్చారు. ఎంతో ఉన్నతమైన స్థాయికి ఎదగాలని తల్లితండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు.
అదేవిదంగా కళాశాల సిఇవోని అధ్యాపకులను శాలువాలతో సత్కరించారు. ఇదేవిధంగా ఎప్పుడు విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. కార్యక్రమంలో సెన్సార్ బోర్డు మెంబర్ రామకృష్ణ గుప్తా. ఆర్.కె. కళాశాల సిఇవో డాక్టర్ జైపాల్ రెడ్డి, ఆర్.కె. కళాశాల అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.