నిజామాబాద్, డిసెంబరు 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాకు సంబంధించి 2023 – 2024 సంవత్సరానికి గాను జాతీయ వ్యవసాయ గ్రామీణ వికాస బ్యాంక్ ( నాబార్డ్) ద్వారా రూ. 8513 కోట్లతో రూపొందించిన పొటెన్షియల్ లింక్ డ్ క్రెడిట్ ప్లాన్ ను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ సి.నారాయణరెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని తన ఛాంబర్‌లో విడుదల చేశారు.
పంట ఉత్పత్తులు, నిర్వహణ, మార్కెటింగ్ వసతులకు అత్యధికంగా రూ. 4062 కోట్లను ప్రణాళికలో పొందుపర్చారు. నీటి వనరులకు రూ. 82 కోట్లు, వ్యవసాయ యాంత్రికరణకు రూ. 291 . 68 కోట్లు, మత్స్య పరిశ్రమ అభివృద్ధికి రూ. 18.93 కోట్లు కేటాయించారు. వ్యవసాయ ఉత్పత్తుల నిలువ కోసం వెసులుబాటు కల్పిస్తూ గిడ్డంగులు, శీతలీకరణ కేంద్రాల ఏర్పాటు కోసం వార్షిక రుణ ప్రణాళికలో రూ. 188.83 కోట్ల కేటాయింపులు జరిపారు.
అలాగే ఫుడ్ అండ్ ఆగ్రో ప్రాసెస్సింగ్ రంగానికి రూ. రూ.470 . 92 కోట్లు కేటాయించారు. కార్యక్రమంలో నాబార్డ్ డీ.డీ.ఎం నాగేష్, మెప్మా పీ.డీ రాములు, లీడ్ బ్యాంకు మేనేజర్ శ్రీనివాస్ రావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, డీటీడబ్ల్యుఓ నాగూరావు, ఎస్సీ కార్పొరేషన్ ఈ.డీ రమేష్ తదితరులు పాల్గొన్నారు.