కామరెడ్డి, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలలో ఎమ్మెస్ డబ్ల్యూ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి మౌనిక పార్లమెంటు సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం దక్కించుకోవడం అభినందనీయమని, విద్యార్థులు కష్టపడి చదివితే ఎంతటి ఉన్నత శిఖరాలకైనా చేరుకోవచ్చునని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అన్నారు.
గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా భారతదేశం నుండి ఏడుగురు విద్యార్థులకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మాట్లాడే అవకాశం రాగా అందులో నుండి కామారెడ్డి జిల్లా ఆర్కే డిగ్రీ పీజీ కళాశాలకు చెందిన విద్యార్థి మౌనిక ఈ అవకాశాన్ని దక్కించుకొని, మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పాయి గురించి చేసిన అద్భుత ప్రసంగం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచిందన్నారు.
భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆర్కే విద్యాసంస్థల సీఈఓ జైపాల్ రెడ్డి, జేఆర్సి వైఆర్సి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్, కల్కి మానవ సేవా సమితి ప్రతినిధి ఏర్రం చంద్రశేఖర్, ప్రిన్సిపాల్ సైదయ్య, డీన్ నవీన్ పాల్గొన్నారు.