కామారెడ్డి, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఐఎఫ్‌ఎంఎస్ పోర్టల్‌లో పెండిరగ్ ఉన్న చెక్కులను, ట్రెజరీలో పెండిరగ్లో ఉన్న చెక్కులను ఇటీవల పిఎఫ్‌ఎం ఎస్ ద్వారా చెల్లింపులు పూర్తి చేసినట్లయితే వాటి వివరాలు సమర్పించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి .ఎ. దయాకర్ రావు అన్నారు. శనివారం ఆయన వివిధ జిల్లాల అదనపు కలెక్టర్లలు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
ట్రెజరీ చెక్కులను పిఎఫ్‌ఎంఎస్‌లో ఇకనుంచి జనరేట్ చేయవద్దని సూచించారు. ఎస్‌ఎఫ్సి నిధులు త్వరలో విడుదలవుతాయని తెలిపారు. ట్రెజరీ చెక్కులు పెండిరగ్లో ఉన్న వాటిని క్లియర్ చేయాలని చెప్పారు. నిబంధనల మేరకు గ్రామపంచాయతీ తీర్మానాన్ని అనుసరించి ఏ పేమెంట్ అయిన పిఎఫ్‌ఎంఎస్ నుంచి జనరేట్ చేయవచ్చునని పేర్కొన్నారు.
సర్పంచులకు మండల స్థాయి అధికారులు సంపూర్ణ అవగాహన కల్పించాలని కోరారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎస్ నిధుల ద్వారా జిల్లాలో 163 గ్రామపంచాయతీ భవనాలు కొత్తగా మంజూరైనట్లు చెప్పారు. ఈ పనులను త్వరలో ప్రారంభించాలని మంత్రి సూచించారు. ప్రతి గ్రామ పంచాయతీలో శానిటేషన్ క్రమం తప్పకుండా జరగాలన్నారు. రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు ప్రతినిత్యం శుభ్రం చేయాలని పేర్కొన్నారు.
ప్రతి ఇంటి నుంచి తడి పొడి చెత్త సేకరించి ట్రాక్టర్ ద్వారా డంపింగ్ యార్డ్‌కు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వైకుంఠధామాలలో తాగునీరు, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియ, పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిఆర్‌డిఓ సాయన్న, జెడ్పి సీఈవో సాయ గౌడ్, డిపిఓ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.