కామారెడ్డి, డిసెంబరు 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 29వ తేదీ 2023 నుంచి ఫిబ్రవరి 5, 2023 వరకు వారం రోజుల పాటు యోగ సాదన శిబిరం నిర్వహించనున్నట్టు పరమపూజ్య స్వామి బ్రహ్మానంద సరస్వతి పేర్కొన్నారు. గత 40 సంవత్సరాలుగా యోగ సాధన శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. శిబిరంలో యోగ, ఈశ్వర ధ్యానము, దేశభక్తి, ఉత్తమ మానవ నిర్మాణం తదితర అంశాలపై శిక్షణ ఉంటుందన్నారు.
కామారెడ్డి సమీపంలోని పాతరాజంపేట వద్ద గల ఆర్షగురుకులంలో శిబిరం ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు హరిదాస్ ఆర్య 98492 59011, వేదమిత్ర 93985 26811నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.