నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపకల్పన జరగాలని ఓటరు జాబితా పరిశీలకులు, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ అదనపు డైరెక్టర్ జనరల్ బి.మహేష్ దత్ ఎక్కా సూచించారు. సోమవారం సాయంత్రం ఆయన కలెక్టర్ సి.నారాయణరెడ్డితో కలిసి ఇందల్వాయి మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో కొనసాగుతున్న పోలింగ్ బూత్‌ను సందర్శించారు. …
Read More »Monthly Archives: December 2022
సదాశివనగర్‌లో వైద్య శిబిరం
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశినగర్ మండలం భూంపల్లి గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 300 మందికి గుండె సంబంధిత వ్యాధులు, షుగర్, బిపి సంబంధించి పరీక్షలు నిర్వహించి మందుల పంపిణీ చేశారు. నిజామాబాద్ పట్టణానికి చెందిన ప్రతిభ హాస్పిటల్ యాజమాన్యం భూంపల్లిలో క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో జనరల్ ఫిజీషియన్ డాక్టర్ నవ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రామంలో వైద్య …
Read More »నెలాఖరు నాటికి ఐ.టీ హబ్ పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయానికి (న్యూ కలెక్టరేట్) సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఐ.టీ హబ్ పనులను సోమవారం నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తాతో కలిసి కలెక్టర్ సి.నారాయణ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వివిధ దశల్లో కొనసాగుతున్న పనుల ప్రగతిని పరిశీలించి సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు, కాంట్రాక్టరుకు కీలక సూచనలు చేశారు. ఈ …
Read More »ఆధార్ అనుసంధానం వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక ఓటర్ సవరణ జాబితా -2023 రూపకల్పనలో అర్హత గల ప్రతి ఒక్కరు ఓటర్‌గా నమోదు అయ్యేవిధంగా చూడాలని ఎన్నికల అబ్జర్వర్ మహేష్ దత్ ఎక్కా అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల అధికారులతో సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సదరం డాటా తో దివ్యాంగుల ఓటర్ల జాబితాను సరిపోల్చి అర్హత ఉంటే ఓటర్‌గా నమోదు చేయాలని …
Read More »ఈ నెల 16, 17 తేదీలలో వాలీబాల్ టోర్నమెంట్ కం సెలక్షన్
డిచ్‌పల్లి, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ అంతర కళాశాలల వాలీబాల్ (స్త్రీ పురుషులు) టోర్నమెంట్ కం సెలక్షన్ ఈ నెల 16, 17 తేదీలలో యూనివర్సిటీ గ్రౌండ్‌లో నిర్వహిస్తామని వర్శిటీ క్రీడా విభాగపు డైరెక్టర్ డా. సంపత్ తెలిపారు. టోర్నమెంట్‌లో పాల్గొనువారు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీ.జి., ప్రొఫెషనల్ కళాశాలల్లో నుండి కళాశాలకు ఒక్కో టీమ్ పాల్గొనవచ్చని, టోర్నమెంట్ నిర్వహించడం వర్సిటీలో …
Read More »ప్రజావాణికి 59 ఫిర్యాదులు
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్ ఉన్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 59 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ తో పాటు అదనపు …
Read More »ప్రజావాణికి ప్రాధాన్యత
నిజామాబాద్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు.సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …
Read More »ఈ నెల 26న పద్మశాలి భవన ప్రారంభోత్సవం
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మునిసిపాలిటీ పరిధిలోని పెర్కిట్ లో నిర్మిస్తున్న పద్మశాలి మల్టీపర్పస్ కమ్యూనిటీ హాలు తుదిదశ పనులకు మరో 25 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ప్రకటించారు. నమస్తే నవనాధపురం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోమవారం పెర్కిట్‌లోని పద్మశాలి భవన నిర్మాణం …
Read More »వైభవోపేతంగా అయ్యప్ప మహాపడిపూజ
ఆర్మూర్, డిసెంబరు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామ శివారులో గల పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి సోదరుడు రాజేశ్వర్ రెడ్డి నివాసంలో ఆదివారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ వైభవోపేతంగా జరిగింది. పెద్ద ఎత్తున తరలివచ్చిన అయ్యప్ప స్వామి భక్తుల శరణు ఘోషతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సోదరుడి నివాసం …
Read More »కాంగ్రెస్ పార్టీ బీమా.. కార్యకర్తలకు దీమా
కామారెడ్డి, డిసెంబరు 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి మండలం కొక్కొండ గ్రామానికి చెందిన మెరుగు లాలయ్య గత రెండు నెలల క్రితం ప్రమాదవశాత్తు చెరువులో పడి చనిపోయిన విషయం తెలిసి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం కలిగి ఉండడంతో పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డితో మాట్లాడి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఆదివారం వారి కుటుంబానికి రెండు లక్షల ప్రమాద …
Read More »