Yearly Archives: 2022

గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు టిఎస్‌ఐసి ఆర్థిక సహకారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపే ఆవిష్కరణలకు తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్‌ సెల్‌ తెలంగాణ స్టేట్‌ ఇన్నోవేషన్స్‌ ఫర్‌ రూరల్‌ ఇంపాక్ట్‌ ఇన్సెంటివ్స్‌ (టిఎస్‌ఐఆర్‌ఐఐ) ద్వారా ఆర్థిక సహకారం అందించేందుకు ఆవిష్కర్తల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ సమస్యలను పరిష్కరించే ఆవిష్కరణలు, స్టార్టప్‌లకు మద్దతుగా …

Read More »

టీయూలో ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ స్ఫూర్తిదాయక సదస్సు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు ‘‘లీడర్‌ షిప్‌ మీట్‌’’ అన్న అంశం మీద స్ఫూర్తిదాయక సదస్సు నిర్వహించనున్నారు. ఎక్సెల్‌ ఇండియా మరియు తెలంగాణ విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించపోయే సదస్సుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక బోర్డ్‌ వైస్‌ …

Read More »

మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహిళలు వరకట్న నిషేధ చట్టాన్ని సద్వినియోగం చేసుకోవాలని మొదటి అదనపు ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సౌందర్య అన్నారు. నిజామాబాద్‌ జిల్లా న్యాయ అధికారి సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిజామాబాద్‌ నగరంలోని అర్సపల్లి కురుమ సంఘంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన నిజామాబాద్‌ మొదటి అదనపు ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ సౌందర్య మాట్లాడుతూ …

Read More »

వైఎస్‌ఆర్‌ అభిమాని భిక్షపతికి సన్మానం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ నగరంలోని బడా బజార్‌ చౌరస్తా వద్ద వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ నిజామాబాద్‌ అర్బన్‌ కో ఆర్డినేటర్‌ బుస్సాపూర్‌ శంకర్‌ గారి ఆధ్వర్యంలో పలువురు నాయకులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వైఎస్‌ షర్మిలమ్మ చేస్తున్న పోరాటాలకు, దీక్షలకు ఆకర్షితులై వారు పార్టీలో చేరినట్లు తెలిపారు. అనంతరం నిజామాబాద్‌ నగరానికి చెందిన వైఎస్‌ఆర్‌ వీరాభిమాని, నిస్వార్థంగా రాజన్న కుటుంబం …

Read More »

పోలియో శాశ్వత నిర్మూలనకు కృషి చేయాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్స్‌ పోలియోను శాశ్వతంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం పల్స్‌ పోలియో ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతం చేయాలని కోరారు. చిన్న పిల్లలకు పోలియో చుక్కలు రక్షణగా …

Read More »

పకడ్బందీగా మన ఊరు – మన బడి అమలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులు సమకూరుస్తూ, అత్యున్నత ప్రమాణాలు నెలకొల్పేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి/మన బస్తీ – మన బడి కార్యక్రమం విజయవంతానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి అధికారులకు సూచించారు. శనివారం స్థానిక ప్రగతి భవన్‌లో మండల ప్రత్యేక అధికారులు, వివిధ శాఖల ఇంజినీరింగ్‌, విద్యా …

Read More »

మేధోమదనానికి, ఆత్మవిశ్వాసానికి వేదిక విశ్వవిద్యాలయ చదువు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల సమావేశ మందిరంలో యాంటి ర్యాగింగ్‌ కమిటీ కన్వీనర్‌ ఆచార్య సిహెచ్‌. ఆరతి ఆధ్వర్యంలో శుక్రవారం యాంటి ర్యాగింగ్‌ మీద అవగాహనా సదస్సు నిర్వహించారు. సమావేశానికి ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరై మాట్లాడుతూ… విద్యార్థులందరు వివిధ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక కుటుంబాల నేపథ్యం నుంచి ఇక్కడికి చదువుకోవడం కోసం వచ్చారని …

Read More »

వైఎస్‌ఆర్‌ టిపిలోకి భారీగా చేరిన యువకులు

బోధన్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బోధన్‌ నియోజకవర్గం ఏడపల్లి మండలం ఎంఎస్‌సి ఫారం గ్రామంలో తెరాస పార్టీ నుండి పలువురు యువ నాయకులు బోధన్‌ అర్బన్‌ కో – ఆర్డినేటర్‌ గౌతం ప్రసాద్‌ నాయకత్వంలో వైఎస్‌ఆర్‌ టిపిలోచేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కో ఆర్డినేటర్‌ నీలం రమేష్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా రమేష్‌ …

Read More »

కామారెడ్డి కోర్టు సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్‌ విజయ సేన రెడ్డిని శుక్రవారం కామారెడ్డి జిల్లా కోర్ట్‌ బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు హైకోర్టులో కలిశారు. కామారెడ్డిలో రెండవ అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు, పోక్సో కోర్టు వెంటనే ఏర్పాటు చేయాలని, కామారెడ్డి కోర్టులోని సమస్యలను పరిష్కరించాలని బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు విజ్ఞాపన పత్రం అందజేశారు. కోర్టులో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ …

Read More »

జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ది పరచాలి

కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేసి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలని జహీరాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడు బీ బీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమీక్ష సమావేశం ఎంపీ బీబీ పాటిల్‌ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »