Yearly Archives: 2022

గ్రామస్థాయి నుండి తెరాసకు షాక్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో బీజేపీ జెండాను కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. అనంతరం గ్రామానికి చెందిన 43 మంది యువకులు కాషాయ కండువా కప్పుకొని బీజేపిలో చేరారు. గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన …

Read More »

మొదటి విడతలో 9123 పాఠశాలలు గుర్తించాము

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 9123 పాఠశాలలను మన ఊరు మన బడి మొదటి విడతలో గుర్తించినట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం మన ఊరు -మన బడి కార్యక్రమం అమలులో భాగంగా వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, విద్యాశాఖ మంత్రి సబితా …

Read More »

ఉద్యమ స్పూర్తితో మన ఊరు – మన బడి కార్యక్రమం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలలకు అన్ని హంగులను సమకూరుస్తూ విద్యా వ్యవస్థను మరింతగా పటిష్టపరిచేందుకు వీలుగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో ముందుకు తీసుకెళ్లాలని మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్‌ రావు పిలుపునిచ్చారు. శనివారం వారు రాష్ట్ర విద్యా శాఖ ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మన ఊరు – మన …

Read More »

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియా, పాజిటివ్‌ లైఫ్‌ శిక్షణ

నిజామాబాద్‌, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నెహ్రూ యువ కేంద్ర నిజామాబాద్‌ ఆధ్వర్యంలో ఫిట్‌ ఇండియా,పాజిటివ్‌ లైఫ్‌ శిక్షణ శనివారం నగరంలోని విశ్వశాంతి కళాశాలలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి రఘు రాజ్‌, తెలంగాణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్‌ చందుపట్ల ఆంజనేయులు, జిల్లా యోగ ప్రచారక్‌ ప్రవీణ్‌ కుమార్‌, విశ్వశాంతి విద్యాసంస్థల కరస్పాండెంట్‌ రోజా ప్రభాకర్‌ రావు, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ వేద …

Read More »

కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా చంద్రమోహన్‌

కామారెడ్డి, ఫిబ్రవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి అదనపు కలెక్టర్‌గా చంద్రమోహన్‌ శనివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను కలిసి మొక్కను అందజేశారు. రాష్ట్ర అదనపు కలెక్టర్ల అసోసియేషన్‌ డైరీని ఆవిష్కరించారు. ఇంతవరకు రాష్ట్ర బ్రాహ్మణ సమైక్య పరిషత్‌ అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసిన చంద్రమోహన్‌ కామారెడ్డి అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రెవిన్యూ అదనపు …

Read More »

స్వచ్ఛ సర్వేక్షన్‌ బృందానికి సన్మానం

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వఛ్ఛ సర్వేక్షన్‌ గ్రామీణ సర్వేలో భాగంగా గత మూడు రోజులుగా జిల్లాలో పర్యటించిన అధికారుల బృందానికి ముగింపు సందర్భంగా శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ వారికి సన్మానం చేశారు. సర్వే బృందం గత మూడు రోజులుగా వివిధ గ్రామాల్లోని అభివృద్ధి పనులను పరిశీలించారు. వైకుంఠ ధామాలు, కంపోస్ట్‌ షెడ్లు, మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు, వ్యక్తిగత …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత హర్ష

కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి చెందిన లచ్చవ్వకు (44) ఆపరేషన్‌ నిమిత్తము ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హర్షకు తెలియజేయగానే వెంటనే స్పందించి ఏబి పాజిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారు. ఈ …

Read More »

గడువులోపు పనులు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి పనులకు సంబంధించిన నిర్మాణాలను నిర్ణీత గడువు లోపు పూర్తి చేసి సకాలంలో బిల్లులు పొందాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కాంట్రాక్టర్లకు సూచించారు. ఆర్ధిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నందున పనులు వేగవంతంగా చేపట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అన్నారు. నిర్దేశిత గడువులోపు పూర్తి కానీ పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉన్నందున, …

Read More »

అంతర్జాతీయ జర్నల్‌కి ఎంపిక

వేములవాడ, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ మండల పరిధిలో గల స్థానిక అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ పిజి కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డా. తిరుకోవెల శ్రీనివాస్‌ “Studies on Diatom vapriations with reference to Physio – Chemical Properties of water of Hussain Sagar lake of Hyderabad in Telangana” పరిశోధక వ్యాసం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురణకు ఎంపికైనట్లు …

Read More »

పలువురు అధ్యాపకులకు అకడమిక్‌ పదవులు

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పలువురు అధ్యాపకులకు అకడామిక్‌, పాలనాపరమైన పదవీ బాధ్యతలను ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గురువారం తన చాంబర్‌ లో అప్పగించారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ ఉత్తర్వులను జారీ చేశారు. బీసీ సెల్‌ డైరెక్టర్‌గా మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. ప్రభంజన్‌ యాదవ్‌, మైనారిటీ సెల్‌ డైరెక్టర్‌గా ఉర్దూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »