డిచ్‌పల్లి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని హిందీ విభాగానికి చెందిన పరిశోధక విద్యార్థి లావూరి విజయలక్ష్మికి పిహెచ్.డి. డాక్టరేట్ ప్రదానం చేశారు. అందుకు సంబంధించిన వైవా-వోస్ (మౌఖిక పరీక్ష) ను గురువారం ఉదయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని సెమినార్ హాల్‌లో నిర్వహించారు. హిందీ విభాగంలోని అసోషియేట్ ప్రొఫెసర్ డా. పి. ప్రవీణాబాయి పర్యవేక్షణలో పరిశోధకురాలు ‘‘బంజారా సమాజ్ ఉద్భవ్, పరివేశ్’’ అనే …
Read More »Yearly Archives: 2022
ఇష్టపడి చదివితే ఉజ్వల భవిష్యత్తు
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇష్టపడి చదివితే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గ్రంథాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. పట్టుదలతో చదివి తమ లక్ష్యాలను నెరవేర్చుకోవాలని సూచించారు. వివిధ రకాల ఉద్యోగాలు పొందడానికి పోటీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధమయ్యే విధానాన్ని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా చదివి …
Read More »యూత్ అసోసియేషన్ సేవలని గుర్తించిన నెహ్రు యువ కేంద్రం
భీమ్‌గల్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రిజిష్టర్ నెం. 117 వారు భీంగల్ పట్టణానికి, ప్రజలకు గత ఏడెనిమిది సంవత్సరలుగా మెరుగైన సామాజిక సేవలు అందిస్తున్నందుకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు యువ కేంద్రం వారు యూత్ సేవలని గుర్తించారు. రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎక్సైజ్ …
Read More »విద్యార్థులకు డిజిటల్ విద్యనందించాలి….
కామారెడ్డి, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించాలని సూచించారు. సైన్స్ ల్యాబ్ పరికరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కొద్దిసేపు కలెక్టర్ వాలీబాల్ ఆడారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి ఎల్లయ్య, ప్రధానోపాధ్యాయుడు సాయిలు, …
Read More »జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రోడ్డు ప్రమాదాల నివారణకు అందరూ కలిసి సమిష్టిగా కృషి చేయాలని రాష్ట్ర రహదారి భద్రతా అదనపు డిజిపి సందీప్ శాండిల్య సూచించారు. బుధవారం జరిగిన కామారెడ్డి జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో కమిటీ సభ్యులు, జిల్లా అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు డ్రైవర్ల తప్పిదాలతో పాటు రోడ్డు కండిషన్ కూడా బాగా లేకపోవడం కారణాలు అని …
Read More »అర్సపల్లి శివారులో ఆక్రమణల తొలగింపు
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నార్త్ తహశీల్ కార్యాలయం పరిధిలోని అర్సపల్లి శివారులో గల సర్వే నంబర్. 249 /1 లోని ప్రభుత్వ స్థలాన్ని పలువురు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేశారనే సమాచారం మేరకు బుధవారం నిజామాబాద్ నార్త్ మండలం తహసీల్దార్ ఎం.మధు, వారి సిబ్బందితో కలిసి కబ్జాకు గురైన స్థలాన్ని క్షేత్ర స్థాయికి వెళ్లి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ స్థలంలో …
Read More »కల్నల్ సంతోష్‌బాబుకు విసి శ్రద్దాంజలి
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఇటీవల కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు సతీమణి సంతోషీని ఆత్మీయంగా కలిశారు. గాల్వాన్ వ్యాలీలో భారతదేశ సైనికాధికారిగా వీర మరణం పొందిన కల్నల్ సంతోష్ బాబుకు పరమ వీర్ చక్ర ప్రదానం చేసిన సందర్బంలో సతీమణి సంతోషిని శాలువా, జ్ఞాపికలతో కలిసి పరామర్శించారు. కల్నల్ ధైర్య సాహసాలను, దేశ సేవలో …
Read More »మత్తు పదార్థాల నియంత్రణకు కృషి చేస్తాము
నిజామాబాద్, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మత్తు పదార్థాల నిర్మూలన కోసం మరే ఇతర రాష్ట్రాలలో లేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ఎంతో సాహసోపేత నిర్ణయంతో ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. మత్తు పదార్థాలలో ముఖ్యంగా అనేక సామాజిక రుగ్మతలకు కారణభూతంగా నిలుస్తున్న గంజాయిని సాగు చేస్తున్న వారికి సంక్షేమ పథకాల అమలును నిలిపివేయాలని బహిరంగంగా ప్రకటించడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తోందని అన్నారు. ప్రభుత్వ …
Read More »సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డి సేవలు అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రముఖ సీనియర్ న్యాయవాది, భిక్కనూరు వాస్తవ్యులు పెద్ద బచ్చ గారి రాంరెడ్డి సేవలు అభినందనీయమని కామారెడ్డి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. కామారెడ్డి బార్ అసోసియేషన్‌కు విచ్చేసిన సీనియర్ న్యాయవాది రామ్ రెడ్డిని బుధవారం కామారెడ్డి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అభినందించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ రంగారెడ్డి …
Read More »16 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు పొడగింపు
డిచ్‌పల్లి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 9 వ తేదీ వరకు ఉండగా, విద్యార్థుల అభ్యర్థన మేరకు ఈ నెల 16 వ తేదీ వరకు పొడగించినట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. …
Read More »