Yearly Archives: 2022

జిల్లా కలెక్టర్‌ రక్తదానం చేశారు…

కామారెడ్డి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. తాడ్వాయి మండలం సంగోజివాడిలో శనివారం వసంతపంచమి సందర్భంగా శ్రీ సరస్వతి విగ్రహ ప్రతిష్టాపన చేశారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. సంస్కృతిని, సాంప్రదాయాలను కాపాడుకోవాలని సూచించారు. విద్యార్థులు …

Read More »

మాస్‌ కమ్యూనికేషన్‌ లో ఇద్దరికి డాక్టరేట్‌

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలోని పరిశోధక విద్యార్థులు సట్లపల్లి సత్యం, సిహెచ్‌. రమేష్‌ లకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. వారు రూపొందించిన సిద్ధాంత గ్రంథాల మీద తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో గల మినీ సెమినార్‌ హాల్‌లో శనివారం ఉదయం ఓపెన్‌ వైవా వోస్‌ (మౌఖిక పరీక్ష) నిర్వహించారు. మాస్‌ …

Read More »

సోమవారం నుండి యధావిధిగా ప్రజావాణి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తిరిగి యధావిధిగా నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సీ.నారాయణ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కొవిడ్‌ కేసులు పెరగడంతో గడిచిన రెండు వారాలుగా ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి దోహదపడుతున్న …

Read More »

రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు విరాళం

వేములవాడ, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని శనివారం మెదక్‌ వాస్తవ్యులైన రాగి సత్యనారాయణ అండ్‌ బ్రదర్స్‌ దర్శించుకున్నారు. వారి తండ్రి గారైన కీర్తి శేషులు రాగి చంద్రశేఖర్‌ జ్ఞాపకార్దమ్‌ దేవస్థానం వారిచే నిర్వహిస్తున్న శ్రీ రాజ రాజేశ్వర నిత్యాన్నదాన ట్రస్టుకు 1 లక్ష , 11 వేల, 116 లు ఆలయ పిఆర్‌ఓ చంద్ర శేఖర్‌కు అందజేసి రసీదు పొందారు.

Read More »

రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదాలు జరగకుండా ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదనపు డీజీపీ సందీప్‌ శాండిల్య సూచించారు. సమిష్టి కృషితో సత్ఫలితాలు సాధించగల్గుతామని, ఎంతో విలువైన నిండు ప్రాణాలు కాపాడవచ్చని పేర్కొన్నారు. శనివారం ఆయన హైదరాబాద్‌ నుండి రోడ్డు భద్రత కోసం పాటించాల్సిన జాగ్రత్తలు, చేపట్టాల్సిన చర్యల గురించి ఆయా జిల్లాల రోడ్‌ సేఫ్టీ కమిటీ సభ్యులకు …

Read More »

తెరాస ప్రభుత్వం పేదల పక్షం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని,దాని కొరకు ముఖ్యమంత్రి కెసిఆర్‌ కృషి చేస్తున్నారని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం గాంధారి మండలంలోని ముదెల్లి గ్రామంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్‌తో కలిసి డబల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల నిర్మాణం కొరకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా స్పీకర్‌ పోచారం మాట్లాడుతూ రాష్టంలోని ప్రతి ఇల్లు లేని …

Read More »

మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

గాంధారి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అనారోగ్యంతో ఇటీవల మృతి చెందిన ఎంపీటీసీ భర్త కుటుంబ సభ్యులకు సాయినేని ట్రస్ట్‌ ద్వారా ఆర్థిక సహాయం అందజేశారు. శుక్రవారం గాంధారి తెరాస నాయకులతో కలిసి సాయినేని ట్రస్ట్‌ అధినేత సత్యం రావు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా సత్యం రావు మాట్లాడుతూ మండలంలో ప్రజాదరణ కల్గిన ఎంపీటీసీ భర్త సురేష్‌ మరణించడం బాధాకరం అన్నారు. …

Read More »

సంక్షేమ శాఖల పనుల ప్రగతిపై కలెక్టర్‌ సమీక్ష

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వివిధ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపడుతున్న ప్రగతి పనుల విషయమై కలెక్టర్‌ శుక్రవారం సంబంధిత అధికారులతో తన చాంబర్‌ లో సమీక్ష జరిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో జిల్లాలో కొనసాగుతున్న గురుకులాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ నిర్వహణ తీరుతెన్నుల గురించి అడిగి తెలుసుకున్నారు. సొంత భవనాలు ఎన్ని ఉన్నాయి, ఎక్కడెక్కడ అద్దె భవనాలలో కొనసాగుతున్నయన్న …

Read More »

మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులను పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖలు, ఆయా పథకాల ద్వారా మంజూరీలు తెలుపబడిన ప్రజోపయోగ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి చేసేలా అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. శుక్రవారం ఆయన కలేక్టరేట్‌ నుండి ఆయా శాఖల జిల్లా అధికారులు, ఆర్దీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, ఏపీవోలు, ఇంజనీరింగ్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా నిర్మాణ …

Read More »

పదిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి..

కామారెడ్డి, ఫిబ్రవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పదో తరగతిలో వంద శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించే విధంగా ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శుక్రవారం ప్రధానోపాధ్యాయుల సమావేశానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని సూచించారు. చదువులో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »