నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కరోనా వ్యాప్తి దృష్ట్యా, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేయడమయ్యిందని కలెక్టర్ సీ.నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఒకే చోట గుమిగూడి ఉండడం వల్ల కరోనా మరింతగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన వెల్లడిరచారు. అయితే ప్రజల సౌకర్యార్థం, వారి …
Read More »Yearly Archives: 2022
లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఆకుల లలిత…
భీమ్‌గల్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణకేంద్రంలో దక్షిణ బద్రీనాథ్‌గా పేరుగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారిని శనివారం తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ మహిళ చైర్ పర్సన్, మాజీ ఎంఎల్‌సి ఆకుల లలిత వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు నంబి వంశస్థులు సంప్రదాయ బద్దంగా స్వామి వారి శేషవస్త్రంతో ఆహ్వానించి దర్శనం అనంతరం తీర్థ …
Read More »బృహత్ పల్లె ప్రకృతి వనాలలో వంద శాతం మొక్కలు నాటాలి
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రైతు కళ్ళాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం ఉపాధి హామీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఏపీఓ, ఈసి, సాంకేతిక సహాయకులు ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు చొప్పున రైతు కళ్ళాలను నిర్మించే …
Read More »సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వామ్యం చేయాలి…
కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సేవా కార్యక్రమాలలో యువతను భాగస్వాములు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్ హాజరై మాట్లాడారు. జిల్లాలో రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ముమ్మరంగా చేపట్టాలని సూచించారు. పేద ప్రజలకు సేవలు అందించడంలో …
Read More »అర్బన్ పార్క్ పనులు సకాలంలో పూర్తి చేయాలి
నిజామాబాద్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజల ఆహ్లాదం కోసం ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్క్ పనులను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) చిత్రా మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి సునీల్‌తో కలిసి నిజామాబాద్ శివారులోని చిన్నపూర్ రిజర్వ్ ఫారెస్టు వద్ద ఏర్పాటు చేస్తున్న అర్బన్ పార్కును సందర్శించారు. ఇక్కడ …
Read More »పండరిపూర్ కాలినడక భక్తులకు సన్మానం..
గాంధారి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గం గాంధారీ మండలం ముదెల్లి గ్రామంలో ముదెల్లి నుండి పండరిపూర్ వెళ్తున్న కాలినడక భక్తులకు మదన్ మోహన్ టోపీ, మాస్క్, కండువాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో జామున వెంకట్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సంపత్, గాంధారి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కృష్ణ, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు, …
Read More »ఎల్లారెడ్డి బార్ కౌన్సిల్ నూతన ప్రెసిడెంట్‌కు సన్మానం
ఎల్లారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా ఏర్పాటైన బార్ కౌన్సిల్ కమిటీ ప్రెసిడెంట్ పద్మ పండరిని జాతీయ బీసీ సంక్షేమ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులు కాముని సుదర్శన్ నేత, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇంచార్జి చింతల శంకర్ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ హల్‌లో జరిగిన సమావేశంలో పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కాశిరామ్, బీసీ యూత్ జిల్లా ప్రెసిడెంట్ …
Read More »తొర్తి బహిష్కరణ వివాదంపై మంత్రి ప్రశాంత్ రెడ్డి మౌనమేలా?
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో రెండు నెలలుగా మాల, మాదిగ, గుండ్ల, చాకలి, కుమ్మరి, కమ్మరి, ముదిరాజ్, పద్మశాలి, గొల్ల ఇతర మైనారిటీ కులస్తులందరికీ సాంఘిక బహిష్కరణ విధించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై కేసులు నమోదు చేయాలని జరుగుతున్న ఆందోళనలపై మంత్రి ప్రశాంత్ రెడ్డి స్పందించాలని, తన నియోజకవర్గంలోని గ్రామంలో బహిష్కరణ వివాద పరిష్కారానికి కృషి చేయాల్సిన …
Read More »దొంగ అరెస్ట్, రిమాండ్
కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలో శుక్రవారం అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని పోలీసులు విచారించగా భయపడి చేసిన దొంగతనం ఒప్పుకోగా అసలు విషయం బయటపడిరది. గతంలో జరిగిన దొంగతనం కేసులో పోయిన సొత్తు రికవరీ అయినట్లు డిఎస్పీ సోమనాదం తెలిపారు. రాజంపేట పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 12న అరగొండ గ్రామానికి …
Read More »నామ్ కే వాస్తే అన్నట్టుగా పనిచేస్తే ప్రయోజనం ఉండదు
నిజామాబాద్, జనవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పచ్చదనం పెంపొందిస్తూ, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో మొక్కల నిర్వహణ ఎంతో కీలకం అని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రాతో కలిసి నిజామాబాద్ నగరంలోని సాయినగర్, నాగారం, సారంగపూర్, బైపాస్ రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి రహదారికి ఇరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. …
Read More »