నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న హరితహారం కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ సూచించారు. నాటిన ప్రతి మొక్క సంరక్షణ కోసం చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. కలెక్టర్ నారాయణ రెడ్డి గురువారం డిచ్‌పల్లి నుండి జిల్లా సరిహద్దు బాల్కొండ వరకు జాతీయ రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలు పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో …
Read More »Yearly Archives: 2022
ఎస్‌ఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి…
నిజామాబాద్, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏర్గట్ల మండలం తొర్తి గ్రామంలో సాంఘిక బహిష్కరణ చేసిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గంపై ఫిర్యాదు చేయడానికి వెళ్లిన వారిపై ఏర్గట్ల ఎస్‌ఐ రాజు బెదిరిస్తూ చంపేస్తా చీరేస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నందున అతనిపై క్రమశిక్షణా చర్యలు తీసుకొని ఇతర కులాలను బహిష్కరించిన ఆధిపత్య మున్నూరు కాపు వర్గం పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు …
Read More »ఫిబ్రవరి 9 వరకు డిగ్రీ పరీక్ష ఫీజు గడువు
డిచ్‌పల్లి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు వచ్చే నెల ఫిబ్రవరి 9 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ …
Read More »రాజీవ్ స్వగృహ నిర్మాణాలను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని అడ్లూరు శివారులో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్లో నిర్మించిన గృహాలను, స్థలాలను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. పిచ్చి మొక్కల తొలగింపు పనులను పూర్తిచేయాలని కోరారు. ఫార్మేషన్ రోడ్లు వేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, మునిసిపల్ అధికారులు పాల్గొన్నారు.
Read More »గోదాము నిర్మాణ పనులు 30 లోగా పూర్తిచేయాలి
కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇవిఎం గోదాం నిర్మాణం పనులను ఈ నెల 30 లోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గురువారం ఆయన ఈవీఎం గోదాం నిర్మాణ పనులను పరిశీలించారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆర్‌అండ్‌బి డిప్యూటీ ఇంజనీర్ శ్రీనివాస్ కు సూచించారు.
Read More »నిరుద్యోగ యువకుడి ఆత్మహత్య
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వటం లేదని ఖమ్మంలో బయ్యారంకు చెందిన నిరుద్యోగి ముత్యాల సాగర్ (25) రైలు కింద పడి రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడని ఇది ముమ్మాటికీ టిఆర్‌ఎస్ ప్రభుత్వ హత్యయే అని టీయన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు అన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం వేచి చూసి మరో విద్యార్థి తనువు చాలించాడని, తన చావుకు …
Read More »ప్రగతి సాధించడానికి సమష్టిగా కృషిచేయాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అన్ని రంగాల్లో ప్రగతిని సాధించడానికి అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. 73 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం క్యాంపు కార్యాలయంలో, కలెక్టరేట్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి కొవిడ్ నిబంధనలు …
Read More »జిల్లా అభివృద్ధికి పునరంకితం కావాలి
కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పునరంకితం కావాలనీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం 2022 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌లను బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం …
Read More »క్యారం విజేతలకు బహుమతుల ప్రదానం
భీమ్‌గల్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ సర్పంచ్, రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్, ఎన్‌ఎస్‌ఎఫ్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర రైతు విభాగం ఛైర్మన్‌గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం గత మూడురోజులుగా క్యారం టోర్ని నిర్వహించారు. భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్నీలో విజేతలుగా నిలిచిన ఉత్తమ క్రీడాకారులకు భీమ్‌గల్ మునిసిపల్ ప్రాంగణంలో బుధవారం ఛైర్‌పర్సన్ …
Read More »ఆర్మూర్‌లో తెరాస సంబరాలు
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అధ్వర్యంలో ఎంఎల్‌ఏ జీవన్‌రెడ్డిని నిజామాబాద్ టిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రథసారధిగా జీవన్ రెడ్డిని నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా …
Read More »