Yearly Archives: 2022

ప్రైవేట్‌ వ్యాపార సముదాయాల ఆవరణల్లోనూ మొక్కలు నాటించాలి

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రధాన రహదారులకు ఆనుకుని ఉన్న ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు, సముదాయాల ఆవరణల్లోనూ విరివిగా మొక్కలు నాటించాలని కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం డిచ్‌పల్లి మండలం ధర్మారం, బర్దీపూర్‌ గ్రామ శివార్లలోని నిజామాబాదు హైదరాబాద్‌ ప్రధాన రహదారికి ఇరువైపులా నాటిన హరితహారం మొక్కలను కలెక్టర్‌ పరిశీలించారు. ఈ మార్గంలో కళ్యాణ మండపాలు, పెట్రోల్‌ బ్యాంకులు, మార్బల్‌ షాప్స్‌ …

Read More »

అభ్యుదయానికి పట్టం కట్టిన భండారు అచ్చమాంబ

నిజామాబాద్‌, జనవరి 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునికతకు పట్టం కడుతూ, వందేళ్ల క్రితమే కథాసాహిత్యంలో అభ్యుదయ పంథాలో రచనలు సాగించిన రచయిత్రి భండారు అచ్చమాంబ తెలుగు కథకు బంగారు బాటలు వేసిందని తెలంగాణ విశ్వవిద్యాలయ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ వి త్రివేణి అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాలలో హరిదా రచయితల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి తెలుగు కథా రచయిత్రి భండారు అచ్చమాంబ వర్ధంతి …

Read More »

రాంపూర్‌లో సిసి కెమెరాల ఏర్పాటు …

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం 18వ తేదీ నిజామాబాద్‌ పోలిస్‌ కమిషనర్‌ కె.ఆర్‌. నాగరాజు ఆదేశాల మేరకు నిజామాబాద్‌ పోలీస్‌ కళాబృందం వారి ఆధ్వర్యంలో డిచ్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని రామ్‌పూర్‌ గ్రామ ప్రజలు 32 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్‌ కళా బృందం పలు అంశాలపై అవగాహన కల్పించారు. సీసీ కెమెరాల ఆవశ్యకత వివరిస్తూ ఒక్క సీసీ కెమెరా …

Read More »

బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండేళ్ళ క్రితం బాలుడిని చంపిన కేసులో నిందితునికి జీవిత ఖైదు విధిస్తు మంగళవారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. వివరాలు ఇలా ఉన్నాయి…. రెండు సంవత్సరాల క్రితం 7వ తేదీ ఆగష్టు 2020 రోజున నిందితుడు విభూతి సాయిలు బీబీపేట్‌ మండలానికి చెందిన 10 సంవత్సరాల చిన్న పిల్లవాడిని బీబీపేట్‌ గ్రామ శివారులో, బీరప్ప గుడి …

Read More »

పలువురు అధ్యాపకులకు పాలనా పదవుల బాధ్యతలు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పలువురు అధ్యాపకులు పాలనా పరమైన బాధ్యతలలో నియామకం పొందారు. వైస్‌ చాన్స్‌లర్‌ చాంబర్‌ లో ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ చేతుల మీదుగా మంగళవారం అధ్యాపకులు నియామక పత్రాలను పొందారు. ఉపకులపతి ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య కె. శివశంకర్‌ నియామక ఉత్తర్వులను జారీ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పార్మాస్యూటికల్‌ కెమిస్ట్రీ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. …

Read More »

పనితీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధతో పకడ్బందీగా అమలు చేయాలని, ఎవరైనా తమ పనితీరును మార్చుకోకుండా అలసత్వాన్ని ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి హెచ్చరించారు. హరితహారంను నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కలెక్టర్‌ నారాయణ రెడ్డి మంగళవారం నిజామాబాదు గ్రామీణం, మోస్రా, చందూర్‌, వర్ని మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని …

Read More »

జర్నలిస్టుపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్‌ చేయాలి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల సాక్షి దినపత్రిక విలేఖరి పోశెట్టి పై దాడి చేసిన టిఆర్‌ఎస్‌ కార్యకర్తలను అరెస్టు చేసి దాడికి సూత్రధారులైన వారిని కూడా అరెస్టు చేసి హత్యాయత్నం కేసు నమోదు చేయాలని పిడిఎస్‌యు, పివైఎల్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. నిజామాబాద్‌ నగరంలోని ద్వారక నగర్‌ ఇఫ్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజాసంఘాల నాయకులు వనమాల సత్యం, …

Read More »

గుండెపోటుతో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మృతి

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిక్నూర్‌ సౌత్‌ క్యాంపస్‌లో గల మాస్టర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ విభాగంలో గత 13 సంవత్సరాలుగా అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (కాంట్రాక్ట్‌) గా బాధ్యతలు అందిస్తున్న డా. వి. లక్ష్మణ్‌ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. డా. వి. లక్ష్మణ్‌ ఆకస్మిక మృతి పట్ల తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య …

Read More »

డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు పి.డి.ఎఫ్‌. సీటు

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన ఎం.బి.ఎ. పూర్వ విద్యార్థి, పూర్వ పరిశోధకుడు డా. ఆలోక్‌ రాజ్‌ భట్‌కు ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ సోషల్‌ సైన్స్‌ ఆఫ్‌ రీసర్చ్‌ (ఐసిఎస్‌ఎస్‌ఆర్‌) సంస్థలో పోస్ట్‌ డాక్టరల్‌ ఫెల్లోగా ప్రవేశం లభించింది. ఎం.బి.ఎ. విభాగపు ప్రొఫెసర్‌ డా. కైసర్‌ మహ్మద్‌ పర్యవేక్షణలో ‘‘ఇంపాక్ట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌ మెంట్‌, ఫైనాన్సింగ్‌, డివిడెంట్‌ డిసిషన్‌ ఆన్‌ ద …

Read More »

కల్లా కపటం లేని నాయకురాలు కామ్రేడ్‌ వినోద

బోధన్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ పట్టణంలోని దేవిగల్లీలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా నాయకురాలు కామ్రేడ్‌ వినోద ప్రథమ వర్ధంతి నిర్వహించారు. సభలో జిల్లా ఉపాధ్యక్షురాలు బి. నాగమణి మాట్లాడుతూ కామ్రేడ్‌ వినోద కల్లాకపటం లేని మనిషి అని కొనియాడారు. ఆమె ఇంటికి ఎవరు వెళ్ళినా నవ్వుతూ మాట్లాడేదని, ప్రేమతో పలకరించేదని అన్నారు. కామ్రేడ్‌ వినోద మహిళలు ఎదుర్కొంటున్న …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »