నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాదు నగర అర్సపల్లి శివారులోని తమ భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్ తనయుడు మున్నావర్‌పై చర్య తీసుకొని భూమిని మాకు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్, సిపికి ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించడం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు కోర్టు నుంచి పోలీసు బందోబస్తు తీసుకున్నప్పటికీ కూడా తమ భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని, …
Read More »Yearly Archives: 2022
తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్లదేనిని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్ సిటిజన్ అసోసియేషన్ భవనంలో శనివారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో …
Read More »సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్
నిజామాబాద్, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 27వ డివిజన్ ఆనంద్ నగర్‌లో 10లక్షల జనరల్ ఫండ్‌తో చేపట్టే సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ వెల్డింగ్ నారాయణతో కలిసి నగర మేయర్ దండు నీతూకిరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణమే తక్షణ కర్తవ్యంగా పనులు చేస్తున్నామని ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా …
Read More »ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్ వెంట ఎన్నికల సూపరింటెండెంట్ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.
Read More »ఉపాధి పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్ , …
Read More »మొక్కజొన్న పంట క్షేత్రాలు సందర్శించిన శాస్త్రవేత్తలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, కల్వరాల గ్రామంలో మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్ కే. నగేష్, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త అలాగే కరీంనగర్ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్.శ్రావణి, …
Read More »రైల్వేలో, ఆర్టీసీ ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణాలలో సీనియర్ సిటిజన్లకు, మహిళలకు రాయితీలను పునః ప్రారంభించాలని, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రాష్ట్ర కార్యదర్శి కే.రామ్మోహన్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రలో ఆర్టీసి ప్రయాణాల్లో రాయితీలు ఆయారాష్ట్ర …
Read More »స్వయం ఉపాధితో కుటుంబానికి అండగా…
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మగ్గం శిక్షణ పొందిన మహిళలు ప్రతి ఒక్కరు స్వయం ఉపాధి పొంది కుటుంబానికి అండగా నిలవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఎస్బిఐ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ (ఆర్‌ఎస్‌ఈటిఐ), డిఆర్‌డిఓ కామారెడ్డి ఆధ్వర్యంలో మగ్గం శిక్షణ ముగింపు సమావేశానికి జిల్లా కలెక్టర్ హాజరై మాట్లాడారు. మగ్గం శిక్షణతో ఉపాధి అవకాశాలు ఉన్నాయని సూచించారు. …
Read More »బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బతుకమ్మ పండుగ తెలంగాణలో వారసత్వంగా వస్తుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌లో శుక్రవారం టీఎన్జీవోస్, ఉద్యోగుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సంబరాలకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా మాట్లాడారు. పూలను పూజించే పండగ బతుకమ్మ అని తెలిపారు. బతుకమ్మను తొమ్మిది రోజులపాటు నిర్వహించాలని ప్రభుత్వం అవకాశమిచ్చిందని చెప్పారు. మహిళలు, చిన్నారులు సంతోషంగా సంబరాల్లో …
Read More »గురుకుల ప్రిన్సిపాల్స్‌కు కలెక్టర్ సూచన
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : విద్యార్థుల చేతులు శుభ్రంగా ఉంచుకునే విధంగా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. మైనార్టీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలోని మైనారిటీ సంక్షేమ గురుకుల పాఠశాలలో శుక్రవారం ప్రిన్సిపాల్‌లకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. వసతి గృహాల పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కిచెన్‌షెడ్, స్టోర్‌రూమ్, మరుగుదొడ్లు శుభ్రంగా …
Read More »