నిజామాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణవాది, స్వాతంత్య్ర పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమాజంలో వెలిసిన ఆణిముత్యం అని జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి కొనియాడారు. ఆయన ఆశలు, ఆశయాల సాధన కోసం కలిసికట్టుగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతిని పురస్కరించుకుని మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో వెనుకబడిన తరగతుల …
Read More »Yearly Archives: 2022
కామారెడ్డి శారదామాత ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహిస్తున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని తూర్పు హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ శారద మాత దేవాలయంలో శ్రీ శారద శరన్నవరాత్రి ఉత్సవాలు రెండవ రోజు శారదా దేవి గాయత్రి పంచముఖాలతో జగతికి జ్ఞానాన్ని ప్రసాదిస్తున్న దేవతగా కామారెడ్డి జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి నవగ్రహాల మహా …
Read More »ముదెల్లిలో సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
గాంధారి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజల సురేందర్ నిధుల నుండి గాంధారి మండలం ముద్దెల్లి గ్రామానికి రూ.15 లక్షల సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే మంజూరు చేశారు. కాగా మంగళవారం సీసీ రోడ్డు నిర్మాణ పనులను స్థానిక సర్పంచ్ పిట్ల కళావతి-లక్ష్మణ్‌తో కలిసి ఎంపీపీ రాధబలరాం నాయక్, జడ్పీటీసీ శంకర్ నాయక్ ప్రారంభించారు. కార్యక్రమంలో ముద్దెల్లి సొసైటీ ఛైర్మన్ సాయిరాం, స్థానిక …
Read More »సకాలంలో ప్లేట్‌లెట్స్ అందజేసి ప్రాణాలు కాపాడిన శ్రీనివాస్
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆశ్రాన్ ఓ ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నాడు. డెంగ్యూ వ్యాధితో తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రీనివాస్ మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో బి పాజిటివ్ ప్లేట్‌లెట్స్‌ను అందజేసి ప్రాణాలు కాపాడారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల రెడ్‌క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త …
Read More »అడవుల రక్షణతోనే భావితరాలకు మేలు
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోడు భూములను సాగు చేస్తున్న గిరిజనుల దరఖాస్తులను ఈనెల 28 నుంచి పరిశీలించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లు మంగళవారం ఆయన మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. అక్టోబర్ 28 లోగ పోడు భూముల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రతి మండలంలో 6 నుంచి 8 బృందాలను ఏర్పాటు చేసి …
Read More »కామారెడ్డిలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి
కామారెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అణగారిన వర్గాల హక్కుల పరిరక్షణకు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ కృషి చేశారని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కొత్త బస్టాండ్ సమీపంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకల సందర్భంగా ఆయన విగ్రహానికి మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమిపూజ
కామారెడ్డి, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 1 వార్డ్‌లో రెండు గదుల ప్రైమరీ స్కూల్ భవనమును ప్రారంభించిన 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీద రాణి మహేష్. ఈ సందర్భంగా 1 వార్డ్ కౌన్సిలర్ గడ్డమీది రాని మహేష్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆదేశాల మేరకు రెండు గదుల ప్రైమరీ స్కూల్ నూతన భవన ప్రారంభించడం జరిగిందన్నారు. తమ గ్రామానికి …
Read More »జిఓ 59 క్రమబద్దీకరణకు స్థలాలు పరిశీలించిన ఆర్‌డిఓ
నందిపేట్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో జారీ చేసిన జీవో 59 ప్రకారం స్థలల క్రమబద్ధీకరణ కొరకు దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల స్థలాల నమోదు ప్రక్రియను తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణకు దరఖాస్తుదారుల అభ్యర్థనల మేరకు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా స్థలాల పరిశీలన చేసి వివరాలను 59 జిఓ వెరిఫికేషన్ యాప్‌లో పొందుపరుస్తున్నామని ఆర్ముర్ ఆర్‌డిఓ శ్రీనివాస్ …
Read More »హిందీ భారతీయులందరిని ఒకటిగా ఉంచే మూల మంత్రం
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హిందీ భాష భారతీయలందరిని ఏక సూత్రం మీద కలిపి ఉంచే మూల మంత్రమని ఎస్‌బిఐ సీనియర్ మేనేజర్ సురేష్ అన్నారు. నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో నిర్వహించిన హిందీ కవి సమ్మేళనానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. హిందీని మనం నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి …
Read More »28 నుండి జిల్లా పరిషత్ స్టాండిరగ్ కమిటీ సమావేశాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 28 వ తేదీ నుండి జిల్లా పరిషత్ స్థాయి సంఘ సమావేశాలు జరుగుతాయని జెడ్పి సీఈఓ గోవింద్ తెలిపారు. 28 వ తేదీన వ్యవసాయంపై సమావేశం ఉంటుందని, 29 న ఉదయం విద్యా,వైద్యంపై, మధ్యాన్నం మహిళా శిశు సంక్షేమంపై, 30 న ఉదయం సాంఘిక సంక్షేమం, మధ్యాన్నం సమయంలో వర్క్స్ అండ్ ఫైనాన్స్ కమిటీ సమావేశం …
Read More »