Yearly Archives: 2022

బస్సు బోల్తా, తృటిలో తప్పిన ప్రమాదం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ రాష్ట్ర మూడో మహాసభలకు హాజరై శంషాబాద్‌ హైదరాబాద్‌ నుండి నిజామాబాద్‌ వస్తుండగా ప్రమాదవశాత్తు బస్సు బోల్తా పడిరది. బస్సులో ప్రయాణిస్తున్న సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమన్న, జిల్లా కార్యదర్శి పి సుధాకర్‌, జిల్లా నాయకులు ఓమయ్య, రాజేశ్వర్‌లకు గాయాలయ్యాయి. గురువారం ఉదయం నాలుగు గంటలకు సికింద్రాబాద్‌ జూబ్లీ బస్టాండ్‌ నుండి బోధన్‌ డిపో సూపర్‌ లగ్జరీ …

Read More »

జిపిలో లబ్దిదారుల జాబితా పెట్టండి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండలం కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ ఫ్లోర్‌ లీడర్‌ నా రెడ్డి మోహన్‌ రెడ్డి ఆధ్వర్యంలో కొత్త పెన్షన్‌ లిస్టు గ్రామపంచాయతీలో పెట్టాలని జిల్లా గ్రామ అభివృద్ధి అధికారి బి .సాయన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నా రెడ్డి మోహన్‌ రెడ్డి, పోసానిపేట్‌ గ్రామసర్పంచ్‌ గీ రెడ్డి, మహేందర్‌ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

Read More »

తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 16 నుండి మూడు రోజుల పాటు ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించతలపెట్టిన తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజుతో కలిసి వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వజ్రోత్సవ వేడుకలు, వినాయక నిమజ్జనోత్సవ ఏర్పాట్లపై …

Read More »

అనీమియాతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మాధవి (36) అనిమియాతో జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో ఆమెకు అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తము అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఉద్యోగి చేతన్‌ కృష్ణ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త, ఐవిఎఫ్‌ …

Read More »

విద్యుత్‌ షాక్‌తో రైతు మృతి

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలంలోని కోమటిపల్లి గ్రామానికి చెందిన ఈదుల ముత్తన్న బుధవారం పొలంలో గడ్డి కోస్తుండగా ప్రమాదవశాత్తు కొడవలి బోరు విద్యుత్తు తీగకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం… మృతుడు ఈదుల ముత్తన్న భార్య లసుంబాయితో కలిసి బుధవారం ఉదయం తన పొలంలో కలుపుతీయడానికి వెళ్ళాడు. ఆమె కలుపుతీస్తుండగా ముత్తన్న కరంటు డబ్బా …

Read More »

రెడ్‌ క్రాస్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఐఐఐటి విద్యార్థులకు సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బీబీపేట్‌ మండలం మాందాపూర్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ జిల్లా వైస్‌ చైర్మన్‌ అంకన్నగారి నాగరాజ్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో జిల్లా అటవీ శాఖ అధికారి నిఖిత చేతుల మీదుగా పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించి బాసర ట్రిపుల్‌ ఐటీ లో సీట్లు సాధించిన 22 మంది విద్యార్థులకు, …

Read More »

పండుగ వాతావరణంలో తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విమోచన ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16, 17, 18 తేదీలలో మూడు రోజుల పాటు చేపట్టనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను పండగ వాతావరణంలో నిర్వహించేందుకు అట్టహాసపు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సూచించారు. బుధవారం సాయంత్రం ఆయన డీజీపీ మహేందర్‌ రెడ్డితో కలిసి హైదరాబాద్‌ …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో విద్యుత్‌ శాఖ అధికారికి సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని సౌత్‌ విద్యుత్‌ శాఖ కార్యాలయానికి సబ్‌ ఇంజనీర్‌గా నూతనంగా బదిలీపై వచ్చి ఇన్చార్జ్‌ అసిస్టెంట్‌ ఇంజనీర్‌గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్‌కి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా ఇంచార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం …

Read More »

నందిపేట ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్‌

నందిపేట్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండల ఎస్‌ఐగా సల్ల శ్రీకాంత్‌ బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇదివరకు ఎస్‌ఐగా కొనసాగిన మురళిని 2 నెలల క్రితం జిల్లా పోలీసు కార్యాలయానికి అటాచ్‌ చేశారు. అప్పటి నుండి రెండవ ఎస్‌ఐగా ఉన్న అరిఫుద్దీన్‌ ఇంచార్జిగా కొనసాగుతున్నారు. జిల్లా పోలీస్‌ కమిషనర్‌ నాగరాజు ఆదేశాల మేరకు ఆర్మూర్‌లో రెండవ ఎస్‌ఐగా విధులు నిర్వర్తిస్తున్న శ్రీకాంత్‌ బదిలీపై …

Read More »

బిజెపి నేతలు లాజిక్‌ మరిచిపోయారు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2014 కన్నా ముందు చాలా మంది నాయకులు వచ్చారు పోయారనీ, 50 ఏళ్ళలో జరగని అభివృద్ధి తెలంగాణ వచ్చాక కెసిఆర్‌ నిజామాబాద్‌ నగరానికి నిధులిచ్చి అభివృద్ధి చేయిస్తున్నారని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా అన్నారు. వివాదాలకు దూరంగా ఉంటూ నగర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. బుధవారం స్థానిక ప్రెస్‌ క్లబ్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »