Daily Archives: January 2, 2023

నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగటివ్‌ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్‌ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …

Read More »

వివాహిత ఆత్మహత్య

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని వీరన్నగుట్ట తాండకు చెందిన రాథోడ్‌ శాంతాబాయి (45) అనే వివాహిత ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్టు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. మృతురాలు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుందన్నారు. ఆమెకు జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిరదన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై సాయన్న తెలిపారు.

Read More »

పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

ఆర్మూర్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్‌ గ్రామంలో పెర్కిట్‌ మున్నూరుకాపు సంఘంలో 2023 నూతన కార్యవర్గం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడిగా బాశెట్టి చిన్నారాజన్న, కోశాధికారిగా (క్యాషర్‌) జక్క రమణయ్య, అలాగే గ్రామంలో పెర్కిట్‌ గ్రామాభివృద్ధి కమిటీకి సొన్న నాగరాజుని ఎన్నుకున్నారు. ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అలాగే సంఘంలో …

Read More »

తెలంగాణ ఉద్యమకారుడు శ్రీధర్‌ రెడ్డి మరణం తీరని లోటు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 1969 ప్రత్యేక తెలంగాణోద్యమ నాయకుడు,కవి, రచయిత, స్నేహశీలి డా. ఎం. శ్రీధర్‌ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులో మరణించారు. ఆయన పలు సందర్భాలలో నిజామాబాద్‌ను సందర్శించారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ఘనపురం దేవేందర్‌ తిరుమల శ్రీనివాసార్య రచించిన ‘‘నుడుగు పిడుగులు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 2011 ఆగస్టు 13న ఆయన పాల్గొన్నారు. 2017 అక్టోబర్‌ 22న …

Read More »

బీటి రోడ్డు పనులు ప్రారంభం

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కునేపల్లి గ్రామం నుండి బాగేపల్లి వరకు రూ.92.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులను బాగేపల్లి కూనేపల్లి గ్రామాల సర్పంచులు రోడ్డ విజయ లింగం, సాయిలు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో రవాణా సదుపాయానికి ఇబ్బంది కలగడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా …

Read More »

గల్లంతయిన యువకుడు మృతి

రెంజల్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని తాడ్‌ బిలోలి గ్రామానికి చెందిన మిద్దె నరేష్‌ (34) అనే యువకుడు గత శనివారం గోదావరి నదిలో చాపల వేటకు వెళ్ళాడు. చేపలు పట్టే క్రమంలో తెప్పపై నుంచి ప్రమాదవశాత్తు నీటిలో జారిపడడంతో స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందజేశారు. కుటుంబ సభ్యులు ఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఎంత వెతికినా మృతదేహం …

Read More »

సెవెన్‌ హాట్స్‌, ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ లోగో ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో నూతనంగా స్థాపించిన సెవెన్‌ హాట్స్‌ ఆర్గనైజేషన్‌ మరియు ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ ఎన్జీవోల లోగోలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎమ్మెల్సీ బండ ప్రకాష్‌ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌, మాచారెడ్డి ఎంపీపీ లోయంగపల్లి నర్సింగరావుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు …

Read More »

ప్రజావాణికి 81 ఫిర్యాదులు

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ న్న అర్జీలను వెంటదివెంట పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 81 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఒక్కరికీ న్యాయం పొందే హక్కును రాజ్యాంగం కల్పించిందని, ప్రతి ఒక్కరికీ సమాన న్యాయం అందే విధంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ద్వారా ఉచిత న్యాయ సేవలు, సహాయం అందిస్తామని రాష్ట్ర హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లోనీ కోర్టు ప్రాంగణాల్లో నూతనంగా ఏర్పాటు …

Read More »

ఫిర్యాదులు సత్వరమే పరిష్కరించాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »