బీటి రోడ్డు పనులు ప్రారంభం

రెంజల్‌, జనవరి 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని కునేపల్లి గ్రామం నుండి బాగేపల్లి వరకు రూ.92.50 లక్షలతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్డు పనులను బాగేపల్లి కూనేపల్లి గ్రామాల సర్పంచులు రోడ్డ విజయ లింగం, సాయిలు కలిసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో రవాణా సదుపాయానికి ఇబ్బంది కలగడంతో ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌ తమ గ్రామానికి బీటీ రోడ్డు పనులకు రూ.92 లక్షల 50 వేల రూపాయలు మంజూరు చేసి పనులు ప్రారంభించడం అభినందనీయమని అన్నారు.

ఎమ్మెల్యేకి ఇరు గ్రామాల ప్రజలు సదా రుణపడి ఉంటామని అన్నారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్‌ ఏఈ లిఖిత, బిఆర్‌ఎస్‌ నాయకులు భూమేష్‌, ప్రవీణ్‌ తదితరులు ఉన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శనివారం, నవంబరు 23, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »