నిజామాబాద్, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ యువజన ఉత్సవాల్లో భాగంగా యువతీయువకులకు ఉపన్యాసపోటీలు నిర్వజించనున్నట్లు నెహ్రూ యువ కేంద్ర జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ తెలిపారు. జిల్లా క్రీడా మరియు యువజన విభాగం ,నెహ్రూ యువ కేంద్ర సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలలో పాల్గొనే వారు వయసు 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాల లోపు వారై ఉండి, కేవలం 3 నిమిషాల లోపే ఉపన్యాసాన్ని పూర్తి చేయాలన్నారు.
దేశ భవిష్యత్తులో యువత, ప్రజాస్వామ్య పరిరక్షణ మరియు పరిపాలనలో యువత పాత్ర, డిజిటల్ ఇండియా అనే అంశాలపై మాట్లాడాల్సి ఉంటుందని, ఈ పోటీలలో పాల్గొన్నవారికి ప్రశంసాపత్రం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పోటీలో గెలుపొందిన వారు తదుపరి రాష్ట్ర స్థాయికి, అక్కడ గెలిస్తే జాతీయస్థాయికి వెళ్లడం జరుగుతుందన్నారు.
పోటీలు ఈనెల 4వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు, నెహ్రూ యువ కేంద్ర, సుభాష్ నగర్, నిజామాబాద్‌లో ఉంటాయన్నారు. ఇతర వివరాలకై నెహ్రూ యువ కేంద్ర ఆఫీస్ నెంబరు 9100435410 ను ఆఫీసు సమయాల్లో సంప్రదించాలన్నారు.