ఆర్మూర్, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ నియోజకవర్గ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో పెర్కిట్ మున్నూరుకాపు సంఘంలో 2023 నూతన కార్యవర్గం నిర్వహించారు. కార్యక్రమంలో అధ్యక్షుడిగా బాశెట్టి చిన్నారాజన్న, కోశాధికారిగా (క్యాషర్) జక్క రమణయ్య, అలాగే గ్రామంలో పెర్కిట్ గ్రామాభివృద్ధి కమిటీకి సొన్న నాగరాజుని ఎన్నుకున్నారు.
ఈ సంధర్బంగా వారు మాట్లాడుతూ మున్నూరుకాపు సంఘం యొక్క అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని, అలాగే సంఘంలో ఎటువంటి సమస్యలకైనా సభ్యుల సహకారంతో ముందుంటామని తెలిపారు. అలాగే గ్రామాభివృద్ధి కమిటీకి ఎంపికైన సొన్న నాగరాజు కమిటీ పర్యవేక్షణతో గ్రామ అభివృద్ధే తన ధ్యేయమని దానికోసం 2023 లో కమిటీతో కలిసి పెర్కిట్ అభివృద్ధిలో పాలుపంచుకుంటానని తెలిపారు.