కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకేంద్రములో కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
హైదరాబాద్ ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యములో సర్పంచులకు మద్దతుగా ధర్నా నేపథ్యంలో ముందస్తు హౌస్ అరెస్ట్ చేస్తున్నామని కామరెడ్డి ఎస్ఐ రాజు ఉదయం 7 గంటలకే కైలాస్ శ్రీనివాస్ రావు ఇంటికి చేరుకుని హౌజ్ అరెస్ట్ చేశారు.
కైలాస్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వములో ప్రజాస్వామ్యము వుందా అని, ప్రజాస్వామ్యములో ప్రభుత్వముపై ప్రశ్నించే హక్కు లేదా అని అన్నారు. పోలీస్ వారు ప్రభుత్వానికి వత్తాసు పలుకుతున్నారని, కాంగ్రెస్ పార్టీ నాయకులని, సర్పంచులని ధర్నాకు వెళ్లకుండా ఎక్కడి కక్కడ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్యాన్ని కాలరాస్తున్నారని శ్రీనివాస్ రావ్ మండిపడ్డారు.