కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు కేంద్రంలో గల వైద్యశాలకు వెళ్లి ఓ నెగటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి మానవత్వాన్ని చాటడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త బాలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ గతంలో కూడా రాజు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరం ఉన్న గర్భిణీ స్త్రీలకు, ఆపరేషన్ల నిమిత్తమై రక్తదానానికి ముందుకు వచ్చాడని, తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం కూడా రక్తదానం చేశాడని, ఇలాంటి వ్యక్తులే నేటి సమాజానికి ఎంతగానో స్ఫూర్తిదాయకమని రక్తదానం చేసిన రక్తదాత రాజుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి ఎల్లవేళలా సకాలంలో రక్తము అందజేయడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 15 సంవత్సరాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు. రక్తదానం చేయాలనుకునేవారు వారి వివరాలను 9492874006 నెంబర్ కి తెలుపగలరని కోరారు.