కామారెడ్డి, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో నూతనంగా స్థాపించిన సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఎన్జీవోల లోగోలను తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బండ ప్రకాష్ తో కలిసి ఆవిష్కరించారు. అలాగే కామారెడ్డి శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, మాచారెడ్డి ఎంపీపీ లోయంగపల్లి నర్సింగరావుతో కలిసి ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సేవా భావం కలిగిన ఎమ్మెస్ డబ్లు విద్యార్థులు ఇతరులు కలిసి ఒక మంచి ప్రణాళిక రచించి, స్వచ్ఛంద సేవ సంస్థలు అయిన సెవెన్ హార్ట్స్ ఆర్గనైజేషన్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ స్థాపించడం మంచి పరిణామమని, ఈ సంస్థల ద్వారా ఎంతో మందికి చేయుతనిస్తూ సేవ చేయాలన్నారు. కార్యక్రమంలో ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఫౌండర్ భానోత్ నరేష్, సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ జీవన్ నాయక్, మసూద్, రాజు, సురేష్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.