నిజామాబాద్, జనవరి 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 1969 ప్రత్యేక తెలంగాణోద్యమ నాయకుడు,కవి, రచయిత, స్నేహశీలి డా. ఎం. శ్రీధర్ రెడ్డి సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాదులో మరణించారు. ఆయన పలు సందర్భాలలో నిజామాబాద్‌ను సందర్శించారు.
తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ఘనపురం దేవేందర్ తిరుమల శ్రీనివాసార్య రచించిన ‘‘నుడుగు పిడుగులు’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో 2011 ఆగస్టు 13న ఆయన పాల్గొన్నారు. 2017 అక్టోబర్ 22న లో సిహెచ్ మధు రచించిన ‘‘జ్వలిత గీతా సంచలనం’’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 2018లో తెలంగాణ భాష సాహితీ సాంస్కృతిక వేదిక ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.
ఎం శ్రీధర్ రెడ్డి మృతిపట్ల తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్, తెలంగాణ భాషా సాహితి సాంస్కృతిక వేదిక అధ్యక్షులు పంచ రెడ్డి లక్ష్మణ్, ఎనిశెట్టి శంకర్, విపీ చందన రావు, తిరుమల శ్రీనివాస్ ఆర్య, గుత్ప ప్రసాద్, సాయిబాబు తదితరులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.