కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా జిల్లా కేంద్రంలోని 108 అంబులెన్స్ చేస్తున్న సేవలు గుర్తించి బస్సా సాయిలు వారి తండ్రి బాస్స బాలయ్య జ్ఞాపకార్థం తన వంతుగా ఐదు కుర్చీలు ఒక ఫ్యాను అందజేశారు.
108 సేవలు మరువలేనివని, పేద, ధనిక అనే తేడా లేకుండా ఫోన్ రావడంతోనే వారు చేస్తున్న పనిని చూసి ఆసక్తికరమైన కొన్ని సన్నివేశాలు తాను చూడడం జరిగిందని అన్నారు. అందుకే 108 సేవలు 24 గంటలు పనిచేస్తూ కులమత బేధాలు లేకుండా రాత్రనక పగలనక వారు నిత్యం సేవలు చేస్తున్నారని వారిని గుర్తించి తన వంతుగా ఐదు కుర్చీలను ఒక ఫ్యాన్ ఇవ్వడం జరిగిందని అన్నారు.
108 ప్రోగ్రాం మేనేజర్ శ్రీకాంత్ 108 సేవలను గుర్తించి ఆఫీస్ కొరకు ఐదు కుర్చీలు ఫ్యాన్ అందజేసిన సాయిలుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో డిస్టిక్ మేనేజర్ అనిల్ రెడ్డి, రాము, నరేష్ కృష్ణ, స్వామి, అస్లాం సిబ్బంది పాల్గొన్నారు.