రెంజల్, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండలంలోని సాటాపూర్ దివ్యంగుల పాఠశాలలో మంగళవారం పిఆర్టియు నూతన కాలమానిని ఎంపీపీ లోలపు రజినీ కిషోర్, జడ్పీటీసీ మేక విజయ సంతోష్, పిఆర్టియు అధ్యక్ష కార్యదర్శులు సోమలింగం, సాయరెడ్డి చేతులమీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల కోసం అలుపెరగని పోరాటం చేయడంలో పిఆర్టియు ఎప్పుడు ముందుంటుందని ఉపాధ్యాయుల పక్షాన అనునిత్యం వారి గొంతుకై పనిచేస్తుందని వారు అన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఓ గౌసోద్దీన్, ఎంఈఓ గణేష్ రావు, సర్పంచ్ వికార్ పాషా, పిఆర్టియు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేందర్ సింగ్, ప్రధానోపాధ్యాయులు ఆంజనేయులు, శ్రీనివాస్ రెడ్డి, వెంకట లక్ష్మీ, ఉపాధ్యాయులు, శ్రీనివాస్ రెడ్డి, గోవర్ధన్, తహెర్, కృష్ణమూర్తి, రాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు.