కామారెడ్డి, జనవరి 3
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల షెడ్యూల్ కులాల బాలికల వసతి గృహంలో సెవెన్ హార్డ్స్ మరియు ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఎన్జీవో ఆధ్వర్యంలో భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, సంఘ సేవకురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎన్జీవో ప్రతినిధులు మాట్లాడుతూ మహిళల విద్య, అభ్యున్నతి కోసం సావిత్రిబాయి పూలే ఎంతో కృషి చేశారన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సంధ్యారాణి, సెవెన్ హాట్స్ ఆర్గనైజేషన్ ఫౌండర్ జీవన్ నాయక్, ఫోర్ సైడ్ ఆర్గనైజేషన్ ఫౌండర్ నరేష్, ప్రతినిధులు మసూద్, సంతోష్ రెడ్డి, సురేష్ రాజమౌళి, తిరుపతి విద్యార్థినులు పాల్గొన్నారు.