Daily Archives: January 4, 2023

కామారెడ్డికి చేరుకున్న ఎన్నికల సామాగ్రి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంకు 1429 బ్యాలెట్‌ యూనిట్లు, 1017 కంట్రోల్‌ యూనిట్లు బుధవారం వచ్చాయి. జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పర్యవేక్షణలో గోదాంలో నిల్వ చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌, ఆర్డీవోలు శ్రీనివాసరెడ్డి, శీను, తహసిల్దార్లు ఎన్నికల అధికారులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read More »

కళ్లద్దాల కోసం గొడవ… ఫర్నిచర్‌ ధ్వంసం…

ఎడపల్లి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండల కేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్‌లో జంలం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం దాడి చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశాడు. ఈ మేరకు వెటర్నరీ అసిస్టెంట్‌ సమీయుద్దీన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంలం గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్‌ మంగళవారం వెటర్నరీ ఆసుపత్రిలో పనిచేసే వెటర్నరీ అసిస్టెంట్‌ సంయుద్దీన్‌కు …

Read More »

మంత్రి గంగుల కమలాకర్‌కు పితృ వియోగం

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసి సంక్షేమం మరియు ఆహార పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి గంగుల మల్లయ్య (87) మరణం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు సంతాపం వ్యక్తం చేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ తండ్రి, బుధవారం కరీంనగర్‌లో వారి నివాసంలో మృతి చెందారు. మరణవార్త తెలుసుకున్న సిఎం కేసీఆర్‌ మంత్రి గంగులకు ఫోన్‌ …

Read More »

ఆడబిడ్డ పెళ్ళి భారం కాకూడదనే కళ్యాణలక్ష్మి

భీంగల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పేదింటి ఆడబిడ్డ పెళ్లి భారం కాకూడదనే మంచి ఆలోచనతో ముఖ్యమంత్రి కేసిఆర్‌ కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్‌ పథకం ప్రవేశ పెట్టారని రాష్ట్ర రోడ్లు భవనాలు,గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. భీంగల్‌ మండల కేంద్రంలో 120 మంది లబ్ధిదారులకు 1కోటి 20 లక్షల పైగా విలువ చేసే కళ్యాణ లక్ష్మి, …

Read More »

అత్యాధునిక సౌకర్యాలతో ఆర్‌టిసి బస్సులు

హైదరాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన టిస్‌ ఆర్టీసి ఏసి, నాన్‌ ఏసి స్లీపర్‌ బస్సులను స్థానిక ఎమ్మెల్యే అరికేపుడి గాంధీ, సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విసి సజ్జనార్‌తో కలిసి టిస్‌ ఆర్టీసి ఛైర్మన్‌, నిజామాబాద్‌ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ జెండా ఊపి ప్రారంభించారు. ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక సౌకర్యాలతో రాష్ట్రంలో తొలిసారిగా టిఎస్‌ ఆర్టిసి సంస్థ ఏ.సి, నాన్‌ ఏ.సి. …

Read More »

మానవత్వాన్ని చాటిన అయ్యప్ప స్వామి

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా సదాశినగర్‌ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన భూమవ్వ (33) కు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం, రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్‌ క్రాస్‌ జిల్లా మరియు ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …

Read More »

వ్యాయమంతోనే సంపూర్ణ ఆరోగ్యం

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని ఐ.టి.ఐ కళాశాల మైదానంలో వాకర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు బుధవారం నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ మైదానాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మేయర్‌ వాకర్స్‌తో కలిసి వాకింగ్‌ చేసి మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ చేస్తున్న వారిని అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్‌ జిమ్‌ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అందరం చూస్తున్నామని ప్రజల జీవన …

Read More »

ఏడేళ్లలో సాగు విస్తీర్ణం, ధాన్యం ఉత్పత్తి మూడింతలు పెరిగింది

బీమ్‌గల్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ నియోజకవర్గం భీంగల్‌ మండలం సికింద్రపూర్‌ గ్రామంలో 8 కోట్ల 40 లక్షల వ్యయంతో నిర్మించిన 10వేల మెట్రిక్‌ టన్నుల గోడౌన్‌ ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి బుధవారం ప్రారంభించారు. అనంతరం అధునాతన సౌకర్యాలతో నిర్మించిన గోదాంను మంత్రి పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఒక్క …

Read More »

చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్‌ యార్డ్‌ను బుధవారం నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు. ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్‌ యార్డ్‌ వద్ద తనిఖీ చేసి …

Read More »

కామారెడ్డిలో లూయిస్‌ బ్రెయిలీ జయంతి వేడుకలు

కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కలెక్టర్‌ కార్యాలయంలో అంధుల అక్షర ప్రదాత లూయిస్‌ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైన్‌ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ హాజరై నివాళులర్పించి మాట్లాడుతూ ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగును పంచిన మహోన్నత వ్యక్తి అని పేర్కొన్నారు. అతిథులుగా వచ్చిన వారికి సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »