నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నాగారం ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను బుధవారం నగర మేయర్ దండు నీతూకిరణ్ ఆకస్మికంగా తనిఖీ చేసారు. నగర ప్రజలకు మెరుగైన సదుపాయాలు కలుష్య రహిత, చెత్త రహిత నగర నిర్మాణానికి ప్రతి ఒక్కరి సహకారం అవసరమని అన్నారు.
ప్రతి రోజు నగరంలోని ఇంటింటికి వెళ్లి చెత్త సేకరించే వాహనాలను డంపింగ్ యార్డ్ వద్ద తనిఖీ చేసి నిర్ణిత బరువు కన్న తక్కువ సేకరిస్తున్న వాహన డ్రైవర్లకు, జవాన్లకు మందలించారు. నగరంలో ఎక్కడ చెత్త కనిపించిన ఆయా జోన్ల ఇన్స్పెక్టర్లు, జవాన్లు చెత్తను వాహనాల ద్వారా తరలించే విధంగా కార్యాచరణ రూపొందించాలని విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
డంపింగ్ యార్డ్ వద్ద సంబంధిత అధికారులు ఇంచార్జి ఎం.హెచ్.ఓ సాజిద్ అలీ, సానిటరీ ఇన్స్పెక్టర్లు నటరాజ్ గౌడ్, శ్రీకాంత్, ప్రశాంత్, మహిపాల్,సునీల్‌తో సమావేశం నిర్వహించి చెత్త సేకరణపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని చెత్త రహిత నగరమే లక్ష్యంగా పని చేయాలని పనితీరు బాగాలేకపితే చర్యలు తప్పవని అన్నారు.