కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన భూమవ్వ (33) కు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం, రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్‌ను సంప్రదించారు.
పట్టణ కేంద్రానికి చెందిన వ్యాపారి అయ్యప్ప స్వామి జలిగామ సూర్య మోహన్‌కు ఈ విషయాన్ని తెలియజేయడంతో శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి బయలుదేరుతుండగా మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి కామారెడ్డి బ్లడ్ సెంటర్లో రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారు. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం అంటే ఆ సేవ భగవంతునికి చేసిన సేవతో సమానమే అని రక్తదాత జలిగామ సూర్య మోహన్‌కు తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా మరియు రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
కరోనా సమయంలో కూడా 3 యూనిట్ల ప్లాస్మాను అందజేసి ప్రాణదాతగా నిలిచారు. కార్యక్రమంలో కెబిఎస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, సంతోష్ పాల్గొన్నారు.