కామారెడ్డి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంలను జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ బుధవారం పరిశీలించారు. రికార్డులను చూశారు. ఈవీఎం ప్యాడ్లు ఉన్న గదులను తాళాలను పరిశీలించారు.
పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్నికల పర్యవేక్షకుడు సాయిబుజంగరావు, అధికారులు పాల్గొన్నారు.