ఎడపల్లి, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంలోని వెటర్నరీ హాస్పిటల్లో జంలం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశాడు. ఈ మేరకు వెటర్నరీ అసిస్టెంట్ సమీయుద్దీన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జంలం గ్రామానికి చెందిన ఓ పార్టీ నాయకుడు దొడ్డి శ్రీనివాస్ మంగళవారం వెటర్నరీ ఆసుపత్రిలో పనిచేసే వెటర్నరీ అసిస్టెంట్ సంయుద్దీన్కు చెందిన విలువైన కళ్ళ అద్దాలను తనకు తెలియకుండా తీసుకువెళ్లాడు.
తన కళ్ళ అద్దాలు తనకు ఇవ్వాలని పలుమార్లు ఆ నాయకుడిని కోరినా ఇవ్వలేదు. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ ఆ వ్యక్తి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి కళ్ళఅద్దాలు తీసుకువచ్చిన విషయాన్ని తెలిపారు. దీంతో ఆగ్రహించిన దొడ్డి శ్రీనివాస్ సమీయూద్దీన్ పనిచేస్తున్న వెటర్నరీ ఆసుపత్రికి వచ్చి సమీయూద్దిన్పై దుర్బాష లాడుతూ, ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఈ విషయమై సమియోద్దీన్ ఎడపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.