నిజామాబాద్, జనవరి 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని ఐ.టి.ఐ కళాశాల మైదానంలో వాకర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బుధవారం నగర మేయర్ దండు నీతూ కిరణ్ మైదానాన్ని సందర్శించారు.
ఈ సందర్బంగా మేయర్ వాకర్స్‌తో కలిసి వాకింగ్ చేసి మైదానంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ చేస్తున్న వారిని అభిప్రాయాలూ అడిగి తెలుసుకున్నారు. ఓపెన్ జిమ్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను అందరం చూస్తున్నామని ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందే విధంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలని ముఖ్యమంత్రి క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్, పచ్చని ఉద్యానవనాలు ప్రజలందరికి అందుబాటులో ఉండాలని కృషి చేస్తున్నారని గుర్తు చేసారు.
ఐ.టి.ఐ మైదానానికి చాల మంది వాకర్స్ వస్తారని ఇక్కడ ఎమ్మెల్యే ప్రజలందరికి అందుబాటులో ఉండే విధంగా నగరంలోని అన్ని ప్రాంతాలలో క్రీడా మైదానాలు, ఓపెన్ జిమ్స్, ప్రతి డివిజన్‌కు ఒక పార్క్ ఉండే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. ఈ సందర్బంగా వాకర్స్ అసోసియేషన్ వారు మేయర్ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే సహకారంతో మరియు స్థానిక కార్పొరేటర్ బట్టు రాముతో కలిసి సహకరిస్తామన్నారు.