కామారెడ్డి, జనవరి 6
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఎంపీడీవోల అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంపీడీవోల క్యాలెండర్, డైరీని శుక్రవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ప్రభుత్వ ఉద్యోగులు అంకిత భావంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా ఎంపీడీవోలు అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్, ప్రధాన కార్యదర్శి లక్ష్మి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చెన్నారెడ్డి, రాష్ట్ర కౌన్సిలర్ నారాయణ, ఎంపీడీవోలు అనంతరావు, బాలకిషన్ పాల్గొన్నారు.