కామారెడ్డి, జనవరి 7
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మమత (23) గర్భిణీ మహిళ రక్తహీనతతో బాధపడుతున్నడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు.
జిల్లా కేంద్రానికి చెందిన నరేష్ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే అని, తోటి వారికి సేవ చేయడంతోనే మానవ జన్మకు సార్ధకత చేకూరుతుందని మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు రావాలని రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కు వారి యొక్క వివరాలను పంపించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో వీ.టీ ఠాకూర్ రక్తనిధి సిబ్బంది ఏసు గౌడ్, చందన్ పాల్గొన్నారు.